దేశంలో  ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. వాటితో పాటు ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో బాగా కేసులు నమోదు కావడమే కాదు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో అత‌న్ని వెంట‌నే అధికారులు చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వేరే ఇంకెవ‌రికైనా వైర‌స్ సోకుతుంద‌న్న భ‌యంతో కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేస్తున్నారు.

 

అయితే కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో మ‌రో ఇద్ద‌రికీ కూడా క‌రోనా పాజిటివ్ ల‌ని తేల‌డంతో అధికారులు వారిని కూడా ఆసుప‌త్రికి త‌ర‌లించే ప‌నిలో ప‌డ్డారు.  వారు సన్నిహితంగా మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వారందరిని ఇంటి వద్దే ఉండాలని సూచించారు. కాగా, ఈ వ్యక్తితో కలిసి  తెలంగాణ భ‌వ‌న్‌లో మొత్తం ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలిసింది. క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తి యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ ను పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సిద్ధ‌మ‌య్యారు.

 

హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇదిలా ఉంటే..ఢిల్లీలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ జర్నలిస్టులకు సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ సోకకుండా ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: