ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ  మనుషుల ప్రాణాలు తీయడం ఏమో కానీ... మనుషులను మానవత్వం లేని వారిగా మార్చేస్తుంది. కనీసం ఎదుటి వారికి సహాయం చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాల మీదకు వచ్చిన  కూడా కరోనా  వైరస్ భయంతో పట్టించుకోలేనంతగా  మనిషి మారిపోయాడు, తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. కళ్ళ ముందే ఒక వృద్ధా శవం  గంటల తరబడి రోడ్డుపై ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోడ్డుపై ఉన్న మృత దేహాన్ని చూసుకుంటూ వెళ్లారు కానీ... కనీసం ఆ శవాన్ని  ఒక్కరు కూడా దగ్గరికి వచ్చి ముట్టుకోలేదు. 

 


 చివరికి పోలీసులు వచ్చి ఆ అనాధ మృతదేహాన్ని ఒక రిక్షాలో  తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హృదయ విదారక ఘటన మనిషిలో మానవత్వం కరువైంది అన్నదానికి నిలువుటద్దంగా మారిపోయింది. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది ఈ విషాద ఘటన. నగరానికి చెందిన ఓ వృద్ధుడు ఉండడానికి నివాసం లేకపోవడంతో... రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కె.వి.ఆర్ పెరియార్  సలై  రోడ్డుపై భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఆ
 వృద్ధుడు. 

 

 

 ఈ క్రమంలోనే మరణించాడు. మామూలుగా అయితే ఎవరైనా మృతదేహాన్ని తరలించేవారేమో... కానీ  కరరోనా  వైరస్ మహమ్మారి కారణంగా మానవత్వం లేని మనుషులుగా మారిపోయిన జనాలు ఆ మృత దేహాన్ని చూస్తూనే అటు ఇటు తిరిగారు కానీ కనీసం ఒక్కరు కూడా టచ్ చేయలేదు. కనీసం పోలీసులకు కూడా సమాచారం అందించలేదు. దీంతో ఎలాగోలా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ మృతదేహం దగ్గరకు చేరుకున్నారు. ఇక ఆ సమయంలో అంబులెన్సు  కూడా అందుబాటులో లేకపోవడంతో రిక్షాలో మృతదేహాన్ని  తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే తాము రాకముందు నాలుగు గంటలు పాటు ఆ వృద్ధుడి మృతదేహం  రోడ్డుపైనే ఉందని  స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: