ప్రస్తుతం ఇండియా లో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. సూర్య గ్రహణం తర్వాత చాలా మెడిసిన్ లు వైరస్ ని ఎదుర్కొనడానికి ఇంజెక్షన్లు రావటం కొంత ఊరటనిచ్చింది. అయితే అవి ఎంత వరకూ పనిచేస్తున్నాయి ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయి అన్న దాని విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గ్లెన్ మార్క్, హెటిరో లాంటి  ఫార్మా కంపెనీలు ఒకటి మెడిసిన్ వున్నట్లు మరొకటి ఇంజక్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటన చేయడం జరిగింది. మరో పక్క దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజుకి 10 వేలకు మించి నమోదవుతున్నాయి.

IHG

పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వాలు మరియు వైద్యులు చాలావరకు చేతులెత్తేసినట్లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలలో కేదారనాథ్ ప్రత్యేకమైనది. హిమాలయ పర్వతాల దగ్గర అత్యంత ఎత్తులో ఈ కేదారనాథ్ ఉంటుంది. ఇదిలా ఉండగా కేదారనాథ్ ఆలయ పూజారి సంతోష్ త్రివేది ఇటీవల యోగా దినోత్సవం నాడు త్రివేది చేతులు కింద కాళ్ళు పైకి పెట్టి చేతులతో నడుస్తూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆయన ఇలా ప్రదక్షిణ చేయడం విశేషం.

IHG

కాగా కేదారనాథ్ పూజారి ఈ విధంగా చేయడానికి కారణం మరో పక్క దేశంలో ఉన్న వైరస్ తగ్గించాలని తలకిందులుగా ప్రదక్షిణలు చేస్తే వైరస్ ప్రభావం దేశం నుండి వెళ్తుందని తనవంతుగా ఇలా చేశారంట. ప్రస్తుతం వైరస్ కారణంగా చాలావరకు భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో కేదారనాథ్ లో ఆలయ పూజారులు ఎక్కువగా దేవుని సన్నిధి లోనే గడిపేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: