ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మనదే అధికారం...దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలి...ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది... జగన్ ప్రభుత్వం మీద ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది...ఈ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దు అనుకుంటున్నారు...అసలు సీఎంగా జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాను అధికార పీఠాన్ని కోల్పోయి, జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబుతో సహ తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవే.

 

జగన్ సీఎం పీఠంలో కూర్చోవడం ఆలస్యం విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పెన్షన్ 3 వేలు పెంచుతానని చెప్పి, రూ.250 పెంచుకుంటూ పోతానని చెప్పి జగన్ మాట తప్పారని హడావిడి చేశారు. ఇక ఇసుక దొరకక కూలీలు చనిపోతున్నారని, దీక్షలు చేసి రచ్చ చేశారు. అసలు జగన్ అమలు చేసే ప్రతి పథకంపై విమర్శలు చేశారు. ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం, రాష్ట్ర అభివృద్ధికు ఉపయోగపడే మూడు రాజధానులని అడ్డుకోవాలని చూశారు.

 

ఇక కరోనా సమయంలో జగన్ అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తున్నా సరే, కరోనా కట్టడిలో ఫెయిల్ అయ్యాడని, కరోనాతో సహజీవనం తప్పదని అంటే జోకులు వేశారు. అసలు జగన్‌ని ఎన్నిరకాలుగా చేయాలో అన్నీ రకాలుగా నెగిటివ్ చేయడానికి చంద్రబాబు అండ్ కొ ప్రయత్నినించింది. అటు టీడీపీ అనుకూల మీడియా కూడా తనవంతుగా జగన్ ప్రభుత్వంపై విషం చల్లింది. ఇవన్నీ చూస్తే అసలు జగన్ ప్రభుత్వం ఇంత వరెస్ట్‌గా ఉందా? అనేలా టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నించింది.

 

అసలు రియాలిటీలోకి వెళితే జగన్ ప్రభుత్వం పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచేస్తారని, ఆఖరికి అమరావతి పరిధిలో కూడా జగన్‌కే ప్లస్ ఉందని చెప్పేసింది. అయితే జగన్ పాలన నచ్చడంతో పాటు, చంద్రబాబు చేసిన నెగిటివ్ ప్రచారం రివర్స్ అవ్వడం వల్లే జనాల్లో వైసీపీకి ఇంకా ఆదరణ తగ్గలేదని అర్ధమవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు చేసిన ప్రచారమే జగన్‌కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. అసలు జగన్‌కు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా బాబు అండ్ కొ రచ్చ చేయడంతో, జనాల్లో జగన్ పట్ల ఇంకా సానుభూతి పెరిగింది. ఏడాది దాటిన జగన్‌పై క్రేజ్ తగ్గలేదు. చంద్రబాబుపై అభిమానం పెరగలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: