చైనా, పాక్ దేశాలు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. మన దేశం సైలెంట్ గానే ఉన్నా కొత్త వివాదాలు సృష్టిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత ఆర్మీ కొత్త ఎత్తులు వేస్తోంది. సాధారణంగా ఉగ్రవాదులలో రెండు రకాలు ఉంటారు. ఒకరు టెర్రరిస్టులు కాగా రెండోవారు మిలిటెంట్లు. టెర్రరిస్టులు శిక్షణ పొంది ఆయుధాలు తీసుకొని భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అలా చొరబడే వాళ్లను భారత్ కంట్రోల్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో భారత్ సైనికుల చేతిలో 125 మంది చంపబడ్డారు. అదే సమయంలో అంతర్గత శత్రువులు మిలిటెంట్లు. ఈ మిలిటెంట్లు ఎవరనే విషయం బయట పడదు. మిలిటెంట్లు కూడా శిక్షణ పొంది ఉంటారు. కానీ వీళ్లు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సాధారణ జనజీవనం సాగిస్తూనే మిలిటెంట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. 
 
ఈ మధ్య కాలంలో పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వారిని మనవాళ్లు అక్కడికక్కడే మట్టుబెడుతున్నారు. పాక్ నుంచి ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధమై ఉగ్రవాదులుగా చేరే వారి సంఖ్య అంతకంతకూ దీంతో పాక్ మిలిటెంట్లకు ఆయుధాలు పట్టుకోవాలని సూచనలు చేస్తోంది. డ్రోన్ల ద్వారా పాక్ మిలిటెంట్లకు ఆయుధాలను అందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
సైన్యం ఉగ్రవాదులను, మిలిటెంట్లను మట్టుబెట్టిన సమయంలో కొందరు వారిపై జాలితో ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు అయ్యే ప్రమాదం ఉండటంతో సైన్యం ఉగ్రవాదుల తల్లిదండ్రుల వివరాలను సేకరించి వాళ్లు లొంగిపోయేలా చేస్తున్నారు. భారత్ వేసిన ఈ ఎత్తుగడ సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో ఉగ్రవాదుల రహస్యాలు కూడా బయటపడుతున్నాయి. ఒకవేళ వాళ్లు లొంగిపోకపొతే అప్పుడు సైన్యం కాల్చి చంపుతూ ఉండటంతో సైన్యం చెప్పినా ఉగ్రవాదులు వినలేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: