ప్రస్తుతం చైనా భారత సరిహద్దుల్లో సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు కంటే భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల వద్ద ఉన్న ఆయుధాలు ఎంతో పవర్ఫుల్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో దూరంగా ఉన్న టార్గెట్ ను కూడా సైనికులు ధ్వంసం చేయడానికి వీలుగా పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల ఆయుధాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎలా  అయితే భారత సైన్యం ఎంత పవర్ఫుల్ ఆయుధాలను వాడుతుందో... అలాంటి ఆయుధాలని ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. చైనా ఎలాంటి ఘర్షణకు దిగిన సరైన సమాధానం చెప్పడానికి భారత్ క్రమక్రమంగా సిద్ధమైపోతుంది. 

 


 మొన్న జరిగినటువంటి సంఘటన దృశ్య ప్రస్తుతం ఇలాంటి ఎంతో పవర్ఫుల్ ఆయుధాలను చైనా సరిహద్దుల్లోని భారత  సైన్యానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ 95 సూపర్ రైఫిల్స్ ని.. చైనా సరిహద్దు లోని భారత సైన్యానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ద్వారా ఈ ఆయుధాలను అక్కడికి పంపిస్తున్నారు. దీని ద్వారా 1.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను  కూడా సైన్యం దాడి చేయడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే చైనా సరిహద్దుల్లో సైన్యానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి అధికారాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


 అయితే ప్రస్తుతం చైనా సైన్యం నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురైనా  సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తిగా సిద్ధమవుతోంది. మొదట భారత సైన్యం ఎలాంటి కాల్పులు  జరుపదు  కానీ చైనా సైన్యం నుంచి ఏదైనా కాల్పులు జరిగితే మాత్రం వారికి సరిగ్గా బుద్ధి చెప్పడానికి భారత సైన్యం సిద్ధమైపోయింది. ప్రస్తుతం లోకల్ గా ఉన్నటువంటి కల్నల్  స్థాయిలోని అధికారులకే  నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాలు ప్రస్తుతం సైన్యానికి ఇచ్చింది  కేంద్ర ప్రభుత్వం. వెంటనే  పవర్ఫుల్ ఆయుధాలు కూడా పంపించడం  కూడా.. సైన్యంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: