ప్రస్తుతం చైనా భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి భారత్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో చైనాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ  భారత్ మొత్తం ప్రస్తుతం రగిలిపోతుంది . ఇదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు మాత్రం సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చి ప్రచారం మొదలుపెట్టారు. భారత దేశానికి వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నాయి. కొన్ని అసలు ఘర్షణ తోనే సంబంధం లేని సరికొత్త అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. తాజాగా డీఎంకే పార్టీకి సంబంధించిన ఒక టీవీ చానల్ వినిపించిన వాదన ఇలాంటిదే. ప్రస్తుతం ఈ వాదన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది

 

 

 

 

 ప్రస్తుతం డీఎంకే పార్టీ కరుణానిధి మరణంతో స్టాలిన్ చేతిలో కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఒక టీవీ చానల్ నడుస్తూ ఉంటుంది. అయితే మొన్నటికి మొన్న సైన్యం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామంటూ స్టాలిన్ చెప్పారు. కానీ ప్రస్తుతం స్టాలిన్  కి సంబంధించిన ఒక టీవీ చానల్ మాత్రం ఒక వింత వాదన తెరమీదకు తెచ్చింది. అయితే చైనా భారత్ సరిహద్దు లో జరిగిన ఘర్షణ గురించి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం ని రూపొందించింది ఆ టీవీ ఛానల్. 

 

 

 

 

 ప్రస్తుతం చైనా భారత్ కి సంబంధించినటువంటి ఘర్షణ ఏదైతే జరిగింది... ఇదంతా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల వచ్చిందంట. ఆర్టికల్ 370 రద్దు చేసి .. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మోడీ ఇజ్రాయిల్ తో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందులో భాగంగానే యూదులను  తీసుకొచ్చి ఆ ప్రాంతాలలో ఉంచుతున్నారని.. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశారు అని ఒక వింత వాదన వినిపించింది.  అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలకు చెందిన సంస్థల నుంచి పెట్టుబడులను కాశ్మీర్లో కి ఆకర్షిస్తుంది కేంద్రం. దాన్ని విచిత్రంగా చిత్రీకరించి దేశాన్ని నవ్వుల పాలు చేసేలా ఈ టీవీ కార్యక్రమం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: