ఏపీలో ఎస్.కోట ఎమ్మెల్యే విజయనగరం జిల్లాకు చెందిన నేత వైసిపి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.  ఇటీవల ఈ ఎమ్మెల్యే అమెరికా నుండి రావటంతో కరోనా లక్షణాలు ఉండటంతో ట్రూ నాట్ తోపాటు ఆర్డి ఆర్పి పరీక్షలు కూడా చేసినట్లు వాటిలో కూడా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతే కాకుండా ఎమ్మెల్యే గన్ మాన్ కి కూడా ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో వచ్చిన వార్తలు నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా సోకిన ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన నాయకుడు ఫస్ట్ అవుతోంది. ఇటీవల పర్సనల్ విషయాలు కోసం అమెరికా దేశం వెళ్లిన శ్రీనివాసరావు కొన్నిరోజులు అమెరికాలో ఉండి ఇటీవలే రావటం జరిగింది.

 

అనంతరం కొన్నాళ్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అయినా గాని తర్వాత పరీక్షలు చేయించుకోగా మళ్లీ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో సదరు ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న గత వారం అసెంబ్లీ సమావేశాలకు హాజరవటం ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయటం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సదరు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.

 

ఇదిలా ఉండగా మరోసారి శ్రీనివాసరావు నీ పరీక్షలు చేయాలని వైద్యులు డిసైడ్ అయ్యారట ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ బట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలా ?, వద్దా ? అనేది వైసిపి పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. దీంతో అసెంబ్లీ సమావేశాలకు మరియు రాజ్యసభ ఎన్నికలకు పాల్గొన్న నేతల్లో ఈ విషయం తెలుసుకుని టెన్షన్ మొదలైంది. మరో పక్క రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి మండలానికి 104 అంబులెన్స్ ద్వారా వచ్చే 90 రోజులు ప్రతి ఇంటిలో ఉన్న మనిషిని చెక్ చేయించడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: