ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ పార్టీకి చరిత్రలో కనీ వినీ ఎరుగని అవమానం జరిగింది. ఇక లేవలేదా, మళ్ళీ పడిపోతుందా అన్నది నాలుగేళ్ల తరువాత తేలుతుంది. ఇక ఏపీలో బీజేపీ ఎదగాలనుకుంటోంది.  అటువంటపుడు ఆ పార్టీ జనంలో మెప్పు పొందాలి. మంచి పనులు చేయాలి. నిఖార్సు అయిన విపక్షంగా నిరూపించుకోవాలి. కానీ జరుగుతున్నదేంటి. ఏపీ బీజేపీలోని ఒక వర్గం టీడీపీ అడుగుజాడల్లో నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

 

ఇక బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి తదితరులు చంద్రబాబుకు బాగా విధేయులు. ఇక ఏపీలో ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైసీపీ, టీడీపీ ల మధ్య రాజకీయ రచ్చ సాగుతోంది. అయితే మధ్యలో ఎంట్రీ ఇస్తోంది బీజేపీ. నిజానికి బీజేపీ ఈ విషయంలో తన అభిప్రాయం వరకూ చెప్పి తటస్థంగా ఉంటే బాగుండేది. కానీ ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు.

 

ఇక సుజనా చౌదరి కూడా ఈ విషయంలో ఆ పార్టీ నేతగా అభిప్రాయం చెప్పకుండా అతి విమర్శలు చేశారు. అవి కూడా అచ్చం టీడీపీ లైన్లోనే ఉన్నాయి. ఇపుడు నిమ్మగడ్డతో పాటు ఈ ఇద్దరు భేటీ వేసి ఏం చర్చించారన్నది రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ పరువు పోతోంది. ఇల ఒక రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్న వారితో రాజకీయ మంతనాలు సాగించడం అంటే అది కమలం పార్టీకి మచ్చే అంటున్నారు.

 

ఏపీలో వైసీపీ సర్కార్ని అస్థిరపరచానికి కుట్ర అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంటున్నారు. దాన్ని కనుక జనం నమ్మితే బీజేపీ మీద ఆగ్రహం రావడం ఖాయం. తాము ఎన్నుకున్న ఎన్టీయార్  ప్రభుత్వాన్ని నాడు ఇందిరా గాంధీ కూలిస్తే ఇదే తెలుగు జనం ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ గుర్తుంటుంది. ఇపుడు బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలిసే ఈ భేటీ జరిగిందా అన్నది చూడాలి. తెలియక జరిగితే మాత్రం బాధ్యులైన నేతలపైన గట్టిగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏపీలో బీజేపీ తన కళ్ళను తానే పొడుకున్నట్లుగానే భావించాలి.  నైతికతకు, రాజ్యాంగ విలువలకు సంబంధించిన ఈ అంశంలో తేడా గల పార్టీగా బీజేపీ హై కమాండ్ ఇప్పటికైనా స్పందించాలన్న డిమాండ్ ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: