చిన్న గొడవ కూడా లేకుండా లక్షల మంది ప్రాణాలను తీస్తున్న కరోనా వల్ల కలిగే ప్రమాద తీవ్రత ఎంతగా ఉంటుందో ఈ పాటికే అందరికి అర్ధం అయ్యి ఉంటుంది.. అయితే దీని బారిన పడకూడదని ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల కూడా మరిన్ని సమస్యలతో పాటుగా, స్కిన్ అలర్జీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.. ఈ క్రమంలోనే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది..

 

 

ఇక కరోనా బారినుండి తప్పించుకోవాలంటే ముఖానికి మాస్క్ మాత్రమే కాకుండా చేతిలో శానిటైజర్ కూడా పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే మాస్క్‌లతో పాటుగా శానిటైజర్లు కూడా జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి.. ఈ క్రమంలో కొన్ని సంస్థలు తయారు చేస్తున్న శానిటైజర్లు ఆరోగ్యానికి చాలా హానికరమని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. ఇటీవల ఎఫ్‌డీఏ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని శానిటైజర్లు విషపూరితమైనవిగా తేలడంతో వాటిని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక ఈ శానిటైజర్లను చేతికి రాసుకోని ఏదైనా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని హెచ్చరించింది.

 

 

ఇకపోతే ఎఫ్‌డీఏ గుర్తించిన శానిటైజర్లలో ఎక్కువగా ఎస్క్‌బయోకెమ్ సంస్థకు చెందినవే ఉండటం గమనార్హం. ఈ శానిటైజర్లలో, ఎక్కువ శాతంలో మిథనాల్ కలిగి ఉండటం వల్ల కరోనాకంటే భయానకమైన సమస్యలు ఎదురవుతాయని, ఈ శానిటైజర్‌ను చేతికి రాసుకున్నప్పుడు చర్మంలోకి వెళ్తుందని, ఆ చేతులతో ఆహారాన్ని తీసుకుంటే మిథనాల్ కడుపులోకి చేరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు..

 

 

ఈ శానిటైజర్ల ప్రభావానికి గురైతే జలుపు, వికారం, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, వణుకు ఏర్పడతాయని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సూచించారు. కాగా మన ఇండియాలో ఈ సంస్థ ఉత్పత్తులు విక్రయిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియదు గానీ ముందుగా జాగ్రత్త పడటం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: