స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్క్ హయత్ హోటల్ లో ఏపీ రాజకీయ నాయకులు సుజనా చౌదరి మరియు కామినేని శ్రీనివాస్ లతో బేటీ అవ్వటం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాజకీయ నాయకులతో సమావేశాలు ఏంటి అన్న ప్రశ్న రాజకీయాలలో ప్రజలలో నెలకొంది. ఈ తరుణంలో అధికార పార్టీ వైసీపీ నాయకులు కావాలనే నిమ్మగడ్డ కుట్రపన్ని జగన్ ప్రభుత్వం పై బురదజల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

IHG

ఇదిలావుండగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు సుజనా చ ఔదరి, కామినేని శ్రీనివాస్ లను కలిస్తే తప్పేమిటి అని ప్రశ్నిస్తోంది. ఆ పార్టీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ జగన్ తనమీద కక్ష కట్టారని, హైకోర్టు, సుప్రింకోర్టులు చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్పడానికి, రాజ్యాంగ వ్యవస్థల ఔచిత్యాన్ని కాపాడాలని చెప్పడానికి రమేష్ వెళ్లారని ఆయన అన్నారు.

IHG's Political Agenda Exposed! - Great Andhra <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ENGLISH' target='_blank' title='english-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>english</a> ...

ప్రదానికి చెబితే, న్యాయశాఖకు చెబుతారా ? చెప్పండి అని కోరడానికి వెళ్లారని ఆయన అన్నారు. వాళ్లు మాట్లాడకూడదా? వారు అరాచకశక్తులా?కేసులు ఉన్న విజయసాయిరెడ్డి వంటివారిని కలిస్తే తప్పు కాని, సుజనా చౌదరిని కలిస్తే తప్పేంటని అన్నారు. రమేష్ పదవిలో  లేరు కదా..పదవిలో ఉన్నా కలిస్తే తప్పేమిటని అంటున్నారు. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా వీళ్ళ ముగ్గురు జరిపిన సమావేశం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: