తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులను పెద్దఎత్తున పార్టీలో చేర్చుకుని చంద్రబాబును ఒంటరివాడిని చేయాలని ముందుకు వెళ్తున్నారు. అలాగే ముగ్గురు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేయించి, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా టీడీపీకి లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ జరగడానికి ఎన్నో రోజుల సమయం పట్టేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి శాసనమండలిలో బలం ఉంది. ఆ బలం చూసుకుని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది శాసనమండలిలో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే శాసనమండలిని రద్దు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం వంటి సంఘటనలు జరిగాయి. 


ఒకవేళ శాసన మండలి రద్దు కాకపోయినా, త్వరలోనే వైసీపీ కి అక్కడ బలం పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ చూడని ఈ విధంగా టిడిపి సంక్షోభంలోకి వెళ్లిపోవడం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం మింగుడు పడడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర బిజెపి ఒక్కటే తమను ఆదుకోవాలని నమ్ముతున్నారు. అందుకే అవసరం ఉన్నా, లేకపోయినా మోదీని ఎటువంటి మొహమాటం లేకుండా పొగడుతూ, బీజేపీకి తాను ఎప్పుడు విధేయుడిని అనే సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో బిజెపి స్పందించడం లేదు. బాబుతో వ్యవహారం ఎలా ఉంటుందో వారికి తెలియనిది కాదు. అందుకే వారు చంద్రబాబు పోగుడుతున్నా,బీజేపీ దూరం పెడుతున్నట్టు వ్యవహరిస్తోంది.

 


 ఈ విషయాన్ని గ్రహించిన జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ బిజెపికి దగ్గర కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎత్తుగడలు వేస్తున్నాడు. వాస్తవంగా చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ కంటే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే బిజెపికి ఎక్కువ అవసరం ఉంది. అందుకే వైసీపీకి అనుకూలంగానే బిజెపి వ్యవహరిస్తున్నట్టుగా వస్తోంది. ఇక జగన్ కూడా బీజేపీకి తాను వీర విధేయుడుని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చైనా వ్యవహారంపై ప్రధానమంత్రి మోదీ అన్ని ముఖ్యమైన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 


ఆ సమావేశంలో జగన్ మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా, తాము కట్టుబడి ఉంటామని చెబుతూనే మోదీ తీరును పదే అదే పొగడడానికి ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి బిజెపి మద్దతు ఇవ్వకూడదనే ఉద్దేశంతో జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారాలు బాబుకు మరింత మంట కలిగిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: