మొత్తానికి అనుకున్నదంతా అయింది. ఇది మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో అనేక ఆరోపణలు చేస్తోందో అవే ఇప్పుడు నిజమైనట్టుగా తేలుతోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బిజెపి నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు తో కలిసి ఏపీ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 13వ తేదీన పార్క్ హయత్ హోటల్ లో భేటీ అయిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. అసలు టిడిపి అధినేత చంద్రబాబు ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా వైసిపి అనుమానిస్తోంది. అంతే కాకుండా, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. అలాగే ఈ ముగ్గురుతోనూ చంద్రబాబు వీడియో కాల్ లో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో ఏం మాట్లాడారు అనేది సస్పెన్స్ గా మారింది.

IHG


 ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వాడుకోవాలని చూస్తున్నారు. విశాఖలో మత్తు డాక్టర్ వ్యవహారం, చిత్తూరులో అనిత అనే డాక్టర్ వ్యవహారం వైసీపీని ఇరుకున పెట్టేందుకు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని టిడిపి సీరియస్ గా తీసుకుని వైసీపీపై బురద చల్లేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వచ్చాయి. పేరుకే బిజెపి నేతలను నిమ్మగడ్డ  కలిసినట్టుగా ఉన్నా, వారంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో పాటు, అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం  అవుతున్నాయి. 


ఇప్పటికే దీనిపై స్పందించిన సుజనాచౌదరి తనను వ్యక్తిగతంగా కలిసేందుకు కామినేని శ్రీనివాస రావు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చారని చెబుతున్నా, వీరు భేటీకి సంబంధించిన వీడియో వైసిపి సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే హైదరాబాదులో ఈ వ్యవహారం జరగడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా వైసిపికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ ఇంటిలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు ఎప్పటి నుంచో వీరి వ్యవహారాలపై కన్నేసి ఉంచడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా అడ్డంగా దొరికిపోయినట్లు కనిపిస్తోంది. 


త్వరలోనే దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా అయితే ఓటుకి నోటు కేసులో వీడియో ఆధారాలతో సహా దొరికిపోవడం, ఆయన వాయిస్ బయటకి రావడం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ఈ కేసులోనూ బాబు బుక్కయ్యే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: