నిన్న ఉదయం నుండి సంచలనం రేపుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస రావు సుజనాచౌదరి లు భేటీ అయిన వీడియో కి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పలు ఆధారాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తో పాటు ఇద్దరు ఏపీ మాజీ మంత్రులు కలవడం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.

 

అసలు రాజకీయ నాయకులతో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇక వాదనలు వద్దని రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు ఉంది. ఇప్పటికే ఆయన ఆటలను అరికట్టాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని అంబటి డిమాండ్ చేస్తున్నారు.

 

నిజానికి వీరి ముగ్గురి మధ్య భేటీ ఈనెల 13 తేదీన జరిగింది. అంటే టిడిపి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మరియు జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్టు జరిగిన వెంటనే మీటింగ్ చోటుచేసుకుంది. ఇకపోతే మనం వీడియోలో చూస్తే.... వీరు ముగ్గురూ వేర్వేరు సమయాల్లో పార్క్ హయత్ హోటల్ లోకి ఎంటర్ కావడం మరియు వేర్వేరు లిఫ్టుల్లో పైకి చేరుకొని చివరికి ఒకే రూమ్ లో గంటన్నరసేపు చర్చించుకున్నారు. సరే అసలు 13 తేదీ జరిగిన విషయం దాదాపు పది రోజులకి బయటపడడం ఏమిటి అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. క్రమంలోనే ఇప్పుడు కొన్ని నమ్మశక్యం గాని యాంగిల్స్ బయటకు వస్తున్నాయి.

 

నిజానికి మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. అతను టిడిపి ప్రభుత్వానికి మరియు తన సొంత సామాజిక వర్గానికి ఫేవర్ గా వ్యవహరిస్తున్నారని ఎన్నో ఆరోపణలు చేసింది. ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టిడిపి నేతల అరెస్టు అనంతరం జగన్ అతనిపై ఒక కన్నేసి ఉంచాడని వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. అతను ఏదో రకంగా బాబు కి హెల్ప్ చేస్తాడని జగన్ ఊహించాడట. రమేష్ కోసం వేసిన ప్లాన్ లో సుజనా చౌదరి మరియు కామినేని శ్రీనివాస్ కూడా ఉచ్చులో ఇరుక్కున్నారు.

 

ఇదంతా జగన్ వేసిన ప్లాన్ వల్ల బయటకు వచ్చిందని అంటున్నారు. లేకపోతే లాక్ సమయంలో అసలు ఇటువంటి ఒక భేటీ రహస్యంగా జరుగుతుంది అన్న విషయం బయటపడడం చాలా తక్కువ. అదీ పార్క్ హయత్ వంటి హోటల్ ప్రభుత్వానికి తప్ప వీడియో ఎవరికిస్తుంది?

 

ఇక  అసలు లోపల ఏం జరిగింది మరియు ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని పక్కా ఆధారాలతో అనుమానం ఉన్న వారిని అరెస్టు చేయడమే మిగిలింది అని పలువురు అంటున్నారు. అదీ కాకుండా ఇప్పటికే కేంద్రం నిమ్మగడ్డ రమేష్ ను విషయమై వివరణ ఇవ్వమ్మన్నట్లు సమాచారం. జగన్ మాత్రం తన పనిని తాను షూరూ చేశాడట. మరి త్వరలోనే నిమ్మగడ్డకు చెక్ పడబోతోందా?

మరింత సమాచారం తెలుసుకోండి: