గూగుల్ ఎప్పుడు చూసిన కొన్ని సంచలనాత్మక సెర్చ్ చేసిన వివరాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లాక్ డౌన్ లో ఎక్కువమంది అశ్లీల చిత్రాలు చేయడానికి మొగ్గు చూపినట్టు విడుదల చేసింది. ఇప్పుడు లాక్ డౌన్ తరువాత గూగుల్ లో ఎక్కువ మంది ఏమి వెతికారు అని జాబితాను విడుదల చేసి చూపిస్తుంది. గత వారం రోజులుగా ఆన్లైన్ యూజర్స్ గూగుల్ ను అడిగిన ప్రశ్నలను ఆ సంస్థ సమాచారం అందించింది.

 


గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రజలు ఏం వెతుకున్నారో తెలుసా మీకు ?? కొత్తగా వ్యాపారం ఆరంభించడం ఎలా అని, దుస్తులు శుభ్రం చేయడం, సరకుల పంపిణీ, ఫోటోగ్రఫీ వంటి వాటిల్లో అడుగుపెట్టి ఆదాయం ఎలా సంపాదించాలా అని తెలుసుకుంటున్నారట. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ తాజా ట్రెండ్స్ ను విడుదల చేసింది. 

 

 

వ్యాపార సంబంధాల లావాదేవీలు, కొత్త వ్యాపారాలు, ప్రస్తుతం వ్యాపార రంగంలో ఎటువంటి బిజినెస్ లాభదాయకంగా ఉందని తెలుసుకోవడానికి గూగుల్ ఎక్కువ శాతం మంది అడిగారు. అంతేకాకుండా వస్త్ర రంగంలో కొత్త మోడల్స్ ను, వివిధ రకాల ఆశ్చర్య అంశాలను వెతికి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో మనిషి మూడో కన్ను గా కెమెరా మారిపోయింది. అందుకే ఎక్కువగా పని జనాభా కూడా ఫోటోగ్రఫీ వంటి వాటి గురించి గూగుల్ ని అడిగారు. ఇప్పుడు ఫోటోగ్రఫీ వంటి విభిన్న కళల కు మంచి పేరు , మంచి ఆదాయం కూడా లభిస్తుంది.

 

కరోనా వైరస్ కారణంగా ఉపాధి దొరక్కపోవడం, ఉద్యోగాల్లో కోత విధించడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణ కోసం అదనంగా చిన్న చిన్న వ్యాపారాలు ఆరంభించాలనే ధోరణి పెరిగిందని తెలుస్తోంది. ఇక మరికొందరేమో స్థానిక వ్యాపారాలకు మద్ధతునివ్వడం గురించి శోధించారు. 30 రోజుల నుంచి తమ సమీపంలో నల్ల జాతీయులు, మహిళలు, మైనార్టీలు నిర్వహించే వ్యాపారాల గురించి ఆరా తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: