ప్రస్తుతం ఎంతో మంది రాజకీయ నాయకులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారు ఉన్న విషయం తెలిసిందే. చాలామంది అటు రాజకీయాల్లోనూ రాణిస్తూనే మరోవైపు వ్యవసాయంలో కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఎంత ఎదిగినప్పటికీ.. పదిమందికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని మాత్రం ఎప్పుడూ మరవ  కూడదు అని చెప్పకనే చెబుతున్నారు ఎంతోమంది నాయకులు.  తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా ఇలాగే ఆదర్శంగా నిలుస్తోంది. 

 


 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పొలంలో దిగి  అరక పట్టి దుక్కి దున్నుతున్నారు . ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ.. కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ పనులను చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఎంపీ గొడ్డేటి మాధవి. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గుడి దేవుడు ద్వారా సంక్రమించిన పొలం లో దుక్కి దున్ని విత్తనాలు చళ్లారు మాధవి. తన స్వగ్రామం శరభన్నపాలెం నిమ్మగడ్డ వెళ్లే దారిలో ఉన్న తమ పొలంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. అయితే తండ్రి వారసత్వం నుంచి వచ్చిన పొలం లో చిన్నప్పటి నుంచి పని చేయడం సామాజిక కార్యక్రమాలు చేయడం వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి చిన్నప్పటినుంచి అలవర్చుకున్నారు. 

 


 తాను రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా.. ఇప్పటికీ కూడా ఒక సాదాసీదా రైతుబిడ్డగా వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి. ఓవైపు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని... ఇలా తన మూలాలైన వ్యవసాయ పనులను స్వయంగా తానే చేస్తూ ఆదర్శప్రాయంగా మారిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అయితే ఎంపీ అయ్యుండి కూడా పొలంలోకి పనులు చేస్తున్న మాధవి పైన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: