ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం ఆంధ్ర రాజకీయాల్లో గత కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశం కోర్టు లోకి వెళ్లడం ఆ తర్వాత కోర్టుల నుంచి తీర్పులు రావడం ఇలా ఎన్నో కీలక మలుపులు తిరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై అటు అధికార పార్టీ నేతలు అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బీజేపీ నాయకులు సుజనాచౌదరి కామినేని శ్రీనివాస్ తో భేటీ కావడం ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారమే రేపింది. 

 


 ఇలా హోటల్ లో బిజెపి నాయకులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బేటీ కావడంపై అటు వైసీపీ నేతలు అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా  నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ప్రస్తుతం ఎంతో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే తాజాగా ఈ భేటీకి సంబంధించిన స్పందించిన వైసీపీ కీలక నేత పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో కామెంట్  చేశాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామినేని శ్రీనివాస్ సుజనా చౌదరి...  వీరు ముగ్గురు స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

 

 వరుస ట్విట్లతో అటు టీడీపీ అధినేత చంద్రబాబు పై కూడా విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. బాబు హైదరాబాద్లో చేస్తున్న గలీజ్ పనులు ఇవే గోతులు తవ్వడం చీకటి వ్యాపారాలు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో మునిగి తేలుతూ ఉంటాడు అంటూ విమర్శించారు. ఆనాడు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీని సమర్థవంతంగా సమాధి చేసి... ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దళారీ స్థాయికి పతనమయ్యాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు రానున్న రోజుల్లో అధికారం దరిదాపుల్లోకి ఎన్నటికీ రాలేడు అంటూ చంద్రబాబు పై విజయ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: