భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ ఏకంగా 14 వేలకుపైగా కరోనా  వైరస్ కేసులు నమోదవుతుండటం  దేశంలో ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఏకంగా నాలుగు లక్షల దాటిపోవడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ... ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం ప్రజలు మరింత భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో  తీవ్ర భయాందోళనలో  బతుకుతున్న ప్రజలకు ఇటీవలే పలు ఫార్మా కంపెనీలు తీపికబురు చెప్పాయ్. 

 


 కరోనా  వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ తయారు  చేసినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత ప్రజానీకంలో  కొత్త ఊపిరి వచ్చినట్లయింది. అదే సమయంలో యోగా గురువు బాబా రాందేవ్ కూడా కరోనా  వైరస్ కు సంబంధించి ఆయుర్వేదిక ఔషధాన్ని కూడా తయారు చేసినట్లు ప్రకటించడం అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపింది, కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఆయుర్వేదిక్ ఔషదంతో కరోనా  తగ్గుతుందని చెప్పడం కూడా ప్రజలకు తీపి కబురు గా మారిపోయింది. అయితే బాబా రామ్ దేవ్  ప్రకటించిన కరోనా ఔషధం  కేంద్రం పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

 


 ముందుగా ఈ ఔషధాన్ని తాము పరిశీలిస్తామని తెలిపారు. అయితే తాజాగా బాబా రాందేవ్ ఆయుర్వేద మందు తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అంటూ కేంద్ర ఆయుష్ శాఖ తెలిపింది. కానీ నిబంధనల ప్రకారం ఈ ఆయుర్వేద ఔషధాన్ని పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు.  పతాంజలి సంస్థ నుంచి తమకు కరోనా వైరస్ ఔషధానికి సంబంధించిన రిపోర్టు వచ్చిందని...  ఈ ఔషధాన్ని  నిశితంగా పరిశీలించి దానికి పర్మిషన్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: