రెహనా ఫాతిమా ఈ పేరు గుర్తుంది కదా ఓ పర్వర్టెడ్ కేరక్టర్. ఆమెకు ప్రచారమే ఓ సిద్ధాంతం ఆమెకు వేరే ఏ సోయీ ఉండదన్నారు. శబరిమల అయ్యప్ప గుడిలోకి ఎంట్రీ ఇవ్వటానికి నానా రకాలుగా ప్రయత్నిస్తే కాషాయ మూకలు ఆమె ఇంటిపై దాడి చేసి ఇరగదీశాయన్నారు. ఒకసారి నెట్ ‌లోకి వెళ్తే ఆమె విశృంఖలత్వం అర్థమవుతుందని నెటిజన్లు అంటున్నారు. మనకు ఆ ఫోటోలు, ఆ వీడియోలు ఓ కాజ్ కోసం నిజంగా ఏదో పోరాడితే అర్థముంది.

 

 

ఆమెకు మతం లేదు సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు. జనం నోళ్లలో ఆమె పేరు నానాలి దానికి బరితెగింపు సూత్రమే కరెక్టని నమ్ముతుంది ఆమె ఆమె బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగి శబరిమల ఇష్యూ తరువాత మొదట బదిలీ చేశారు. తరువాత మొత్తానికే తీసేశారు. అదంతా ఓ పెద్ద కథ మళ్లీ ఇప్పుడు తెర మీదకు వచ్చింది వస్తుంది. దిక్కుమాలిన సైట్లు, చానెళ్లు ఉండనే ఉన్నాయి.

 

 

రెహానా ఫాతిమాకు ఇద్దరు పిల్లలు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పదేళ్ల లోపు వయస్సున్న కుమారుడు, 12 సంవత్సరాల వయస్సున్న కుమార్తెతో రెహానా ఫాతిమా బాడీ ఆర్ట్ వేయించుకున్నది. టాప్‌లెస్‌గా ఉన్న ఆమె శరీరంపై ఆమె కొడుకు, కూతురు పెయింట్ వేస్తున్న దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. దాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 19 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో కేరళలో ఇప్పుడు దుమారం రేపుతోంది.

 

 

ఈ వీడియో చూసి చిర్రెత్తిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పట్ల కేరళ ప్రభుత్వానికి ఏ సదభిప్రాయమూ లేదు. ఈ ఫిర్యాదు రాగానే తిరువళ్ల పోలీసులు వెంటనే ఆమెపై కేసు పెట్టేశారు. ఐటీ యాక్ట్, జువైలన్ జస్టిస్ యాక్ట్ గట్రా పెట్టేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేశారు.కేసును సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: