కరోనా వైరస్ రావటంతో మనిషి జీవితంలో మాస్క్ తో పాటు శానిటైజర్ భాగమైపోయింది. ఎక్కడ వైరస్ ఉంటుందో ఎక్కడ ఉండదో తెలియని పరిస్థితి కావటంతో ప్రతి ఒక్కరి ఇంట్లో నుండి బయటకు వెళ్లిన సమయంలో చిన్న శానిటైజర్ బాటిల్ పాకెట్ లో పెట్టుకొని ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా అమెరికాకి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్ని శానిటైజర్ లు మంచివి కాదని...కొని కంపెనీలు నకిలీ శానిటైజర్ లు తమ లాభాల కోసం మార్కెట్ లో విడుదల చేశాయని ప్రకటించింది. అంతే కాకుండా ఇటీవల జరిపిన కొన్ని పరీక్షల్లో చాలా శానిటైజర్ లో విషపూరితమైన పదార్థాలు కంపెనీలు వినియోగించినట్లు గుర్తించారు. ఇలాంటి శానిటైజర్ లు రాసుకుని ఏదైనా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరించింది.

 

ఎఫ్‌డీఏ గుర్తించిన శానిటైజర్లలో ‘ఎస్క్‌బయోకెమ్ (Eskbiochem SA) సంస్థకు చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సంస్థకు చెందిన శానిటైజర్ లో ప్రమాదకర మిథనాల్ ఉంది అని… మిథనాల్ కలిగిన శానిటైజర్లను ఉయోగిస్తే ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుందని, కరోనా కంటే భయంకరమైన సమస్యలు ఈ శానిటైజర్ వాళ్ల వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా ఇటువంటి శానిటైజర్ చేతికి రాసుకున్న టైంలో చర్మంలోకి వెళ్లే అవకాశం ఉందని (ఎఫ్‌డీఏ) ప్రకటించింది.

 

మిథనాల్ రాసుకున్న చేతితో భోజనం చేస్తే మిథనాల్ కడుపులోకి వెళ్లి అనేక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ప్రేగులకు కలగజేసి జీర్ణ సమస్యలు కలుగజేస్తుందని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. మరి ఈ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముతున్నారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఇండియాలో శానిటైజర్ ల వాడకం భారీ స్థాయిలో ఉంది. ఈ సందర్భంగా మిథనాల్ కెమికల్ కలిగిన శానిటైజర్ వాడకుండా ఉండాలని ఈ వార్త చూసి చాలామంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: