కరోనా వైరస్ సోకిన రోగులను నయం చేసే మాత్రలు, జనరిక్ మందులు భారతీయ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతి పొంది మార్కెట్లో విడుదల అవుతున్నాయి. వీటి ధర దిమ్మతిరిగే రీతిలో అనగా పేద మధ్యతరగతి వాళ్లకి అందనంత దూరంలో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. నిజానికి గత కొన్ని వారాలుగా కరోనా రోగులను నయం చేసే మందులంటూ కొన్ని సంస్థలు మార్కెట్లోకి గతంలో తయారు చేసిన మాత్రలకు, మందులకు వేరే పేరు పెట్టి ఎక్కువ ధరలకి అమ్ముతున్నాయి. ప్రజల భయాన్ని సొమ్ము చేసుకునే ఈ కరోనా మాఫియా 20 రూపాయల విలువ చేసే మాత్రలను వందల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ఈ మాత్రల ప్రయోగ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేశారో ఎవరికీ తెలియదు. వేల రూపాయలలో ఉండే ఈ మందుల ధరలను డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎందుకు ఆమోదించిందని ఎవరు అడగలేరు. 


అయితే ఈ క్రమంలోనే పతంజలి ఆయుర్వేద కంపెనీ నుండి కొవిడ్-19 పీడితులను నయం చేసే మందు మార్కెట్లోకి విడుదల కానుందని పతంజలి కంపెనీ స్థాపకుడు రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. మొత్తం కరోనా కిట్ ధర కేవలం 545 రూపాయలు మాత్రమేనని, 30 రోజుల వరకు వాడుకోవచ్చని పతంజలి కంపెనీ చెప్పుకొచ్చింది. 15 నుండి 80 సంవత్సరాల లోపు గల వారు ఈ మందును వాడవచ్చని... అంత కంటే తక్కువ వయసున్న వారు... పెద్దవారు తీసుకునే సగం డొసేజ్ తీసుకోవాలి అని చెప్పుకొచ్చింది. ఈ మందు వాడితే వెంటిలేటర్లపై ఉన్న కొవిడ్-19 పీడితులకు తప్ప మిగతా కొవిడ్-19 వ్యాధిగ్రస్తులందరికి జబ్బు నయం అవుతుందని ప్రకటించింది. తాము చేసిన మందు సానుకూల ఫలితాలను ఇస్తోందని పతంజలి సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఆయుష్ శాఖ పతంజలి తయారు చేసిన మందు మార్కెట్లోకి రావడానికి వీల్లేదని, ప్రచారం కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అసలు పతంజలి తయారు చేసిన కరోనిల్ మందు కొవిడ్-19 ని నయం చేస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని, తాము పరీక్షించి ఓకే పర్మిషన్ ఇచ్చేంత వరకూ మందు అమ్మ కూడదని ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ చెప్పుకొచ్చాడు. 


కరోనిల్ మందులో తిప్పతీగ, అశ్వగంధ వంటి ఎన్నో ఆయుర్వేద మూలికలు ఉండగా... అవి శరీరం లోని రోగనిరోధక శక్తిని బాగా పెంచేస్తాయి. నిజానికి ప్రస్తుతం కరోనా తగ్గిస్తామని చెప్పుకొనే అన్ని మందులు శరీరంలోని రోగనిరోధక శక్తిని మాత్రమే పెంచుతాయని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో ధర అని చెప్తూ ప్రజల నుండి డబ్బులు బాగా దోచుకుంటున్నారు. కానీ రాందేవ్ బాబా మాత్రం కేవలం ఐదు వందల నలభై ఐదు రూపాయలకే కరోనా విరుగుడు మందు మార్కెట్లోకి తెస్తాం అని చెప్పుకొచ్చారు. అన్ని మందులకు పర్మిషన్ వచ్చింది కానీ తనకి పర్మిషన్ రాకపోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఒకవేళ పతంజలి కరోనిల్ మందు మార్కెట్ లోకి వస్తే... అది సానుకూల ప్రభావం చూపుతుందో లేదో కేవలం పది ఇరవై రోజుల్లో తేలిపోతుంది. పనిచేయకపోతే ప్రజలు రూ.545 మాత్రమే నష్టపోతారు,( సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే) అలాగే మార్కెట్ నుండి పతంజలి మందులు కనుమరుగవుతాయి. ఒకవేళ సానుకూల ఫలితాలు వస్తే కరోనిల్ ఒక సంచలనం అవుతుంది. ఏది ఏమైనా అనేకమైన కరోనా దందా, మాఫియా మందుల నడుమ పతంజలి మందు చోటు దక్కించుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: