ప్రేమకు వయసుతో పని లేదు అని అంటారు. కానీ వారి ఇద్దరు వయసుతో పని ఉంది అని చట్టం చెబుతుంది. ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే పరవాలేదు కానీ తాత అని పిలిపించుకునే సమయంలో మైనర్ బాలికకు ప్రేమ లేఖలు రాయడం ఎంత వరుకు కరెక్ట్..? వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు కొంత మంది అంటారు.. ఇది ఈ వ్యక్తికి సరిగ్గా సరిపోతుంది కధ..!

 

తమిళనాడులోని కోయంబత్తూర్​కు చెందిన 66ఏళ్ల బాషా.. పక్కింటి 16ఏళ్ల బాలికను 'ప్రేమించాడు'. ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేసి, ప్రేమ లేఖ కూడా ఇచ్చాడు. కంగారు పడిన ఆమె తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించారు. బాషాను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్​ చేశారు.

 

ఆరు పదులు దాటిన వయస్సులో ఓ వృద్ధుడు 'ప్రేమ'లో పడ్డాడు. అది కూడా ఓ 16ఏళ్ల బాలికతో. ఆమె ఒప్పుకోపోయేసరికి బెదిరించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చివరకు ఆ వృద్ధుడు జైలు పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​లో జరిగింది.

 

 

66ఏళ్ల మహ్మద్​​ బాహిర్​ బాషా.. తన పక్కింటిలో ఉంటున్న 16 ఏళ్ల బాలికపై మనసు పారేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశాడు. 'నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నీకు ఇష్టమేనా?' అంటూ మైనర్​కు ప్రేమ లేఖ కూడా ఇచ్చాడు. కంగారు పడిన బాలిక వెంటనే ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. తల్లిదండ్రులిద్దరూ బాషా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని వివరించారు. బాషా ప్రవర్తనకు ఆయన కుటుంబసభ్యులు క్షమాపణలు చెప్పారు.

 

 

కానీ.. ఆ బాలికను బాషా వదల్లేదు. ప్రేమిస్తున్నానని మళ్లీ వెంటపడ్డాడు. ఈసారి బెదిరించాడు కూడా. దీంతో తల్లిదండ్రులు బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద ఆ వృద్ధుడిని అరెస్టు చేసిన పోలీసులు.. కోయంబత్తూర్​ సెంట్రల్​ జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: