చైనా వస్తువులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. క్వాలిటీ లేకపోయినా తక్కువ ధరలోనే చైనా వస్తువులు లభ్యమవుతాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు అతి తక్కువ ధరకే వస్తువులు పొందే అవకాశం ఉండటంతో భారత్ లో చైనా వస్తువుల వినియోగం పెరిగింది. గతంలో కూడా చైనా వస్తువులను నిషేధించాలని డిమాండ్లు వినిపించాయి. జూన్ 15వ తేదీన చైనా భారత్ మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది జవాన్లు చనిపోవడంతో చైనా వస్తువులు, చైనా యాప్స్ నిషేధించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. 
 
భారత్ చైనా మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇరు దేశాల సైన్యాలు కూడా వెనక్కు మళ్లుతున్నాయి. నిజానికి భారత్ కు చైనా నుంచి వచ్చే పెట్టుబడులు చాలా తక్కువ. గత 20 ఏళ్లలో కేవలం 2.35 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. భారత్ లో తొలి 30 సంస్థల్లో 18 సంస్థలకు చైనా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అలీబాబా గ్రూప్, పేటీఎం, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్, జొమాటో, బైజూస్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీ, ఇతర కంపెనీలలో చైనా పెట్టుబడులు పెట్టింది. 
 
భారత్ చైనా వస్తువులను నిషేధించటం కంటే చైనాకు ఆదాయం తగ్గించే వాటిని నిషేధించటం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు చైనా వస్తువులను నిషేధించడం సాధ్యం కాదని.... దశల వారీగా నిషేధించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం మొత్తంలో జరుగుతున్న మార్కెట్ లెక్కల్లో చైనా భారత్ మార్కెట్ వాట్ 23 శాతంగా ఉంది. 
 
అయితే చైనా భారత్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు చెడిపోవడానికి కారణం కూడా చైనానే. అయితే ఈ నిషేధం విషయంలో చైనా వాళ్ల కంటే భారత్ లోని కొంతమంది ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఈరోజు నుంచి భారత్ సొంతంగా వస్తువులను తయారు చేసుకోవడం మొదలుపెడితే పూర్తి స్థాయిలో భారత్ లో వస్తువులు తయారు కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. దేశ ప్రజలు చైనా వస్తువుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మాత్రమే అనుకున్నది సాధించే వీలు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: