నమ్మకు నమ్మకు ఈ రేయిని అని ఒక సినీ కవి పాట రాశారు. దాన్ని కాస్తా మార్చి పాడుకుంటే ఇలాగే వస్తుంది. చైనాను ఎవరూ నమ్మరు,  చైనాకు దోస్తులు ఎవరు అంటే అతి చిన్న దేశాలు, పేద దేశాలే. వాటిని బ్లాక్ మెయిల్ చేసో, ఆర్ధిక సాయం చేసో డ్రాగన్ తన పొద్దుపుచ్చుకుంటోంది. చైనాకు ఉన్న రికార్డుకు, దాని సూపర్ పవర్ శక్తికి ఈపాటికి అమెరికాకు ధీటుగా ఉండాలి. కానీ ఆశలే ఉన్నాయి కానీ వాటి వెనకాల చైనా దుర్మార్గం కూడా తోడు కావడంతో ప్రపంచం మొత్తం చైనాను వద్దు బాబోయ్ అంటోంది.

 

ఇక కరోనా వైరస్ తరువాత ప్రపంచం చైనాను చీదరించుకుంటోంది. అన్ని విషయాలు తెలిసి కూడా చైనా గుట్టు చెప్పలేదన్న ఆగ్రహం ప్రతీ దేశంలో కట్టలు తెంచుకుంటోంది. చైనాని ఓ విధంగా అంతా కలసి దూరం పెట్టారనే చెప్పుకోవాలి. అయితే చైనాను భారత్ చాలా ఏళ్ల తరువాత మోడీ కాలంలో నమ్మింది. మోడీ ఏ ప్రధానీ చేయనన్ని పర్యటనలు ఒక్క చైనాలోనే చేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా భారత్ వచ్చారు. ఇలా మంచిగా ఉన్నాం కదా చైనా ఏమీ చేయదులే అని మోడీ ఆలోచించారు. కానీ సీన్ రివర్స్ అయింది.

 

దాదాపు దశాబ్దలా కాలం తరువాత ఎన్నడూ లేని విధంగా చైనాను నమ్మి భారత్ మోసపోయింది. ఒక్కసారిగా ఇరవై మంది భారత సైనికులను చైనా పొట్టన పెట్టుకుంది. ఇపుడు కూడా చైనా చర్చలు అంటోంది. మరో వైపు సిక్కిం సరిహద్దుల్లో చొరబడింది. డ్రాగన్ బుద్ధి మారదు అని దీంతో మళ్ళీ మళ్ళీ తేలిపోయింది.

 

ఇక భారత దేశం తీసుకుంటే ఇక్కడ మెజారిటీ ప్రజలు మనకు అసలైన శత్రువు పాకిస్థాన్ కాదని చైనావేనని కూడా తేల్చిచెప్పారు. చైనాను చర్చల పేరిట వదలకూడదని, పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాలన్నది ప్రతీ సగటు పౌరుడి డిమాండ్ గా ఉంది. మరి మన పాలకులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: