ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం నాలుగు స్థానాల నుంచి ఆరు స్థానాలకు పెరగటం జరిగింది. వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్న ఆ నలుగురు పేర్లు మంత్రి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ తో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీలు రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ పరిణామంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అవటంతో వైసీపీ పార్టీలోకి బీసీ వర్గంలో ఉన్న నాయకులకు ఆ మంత్రి పదవులు కేటాయించాలని వైసిపి హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

ఈ సందర్భంగా వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే బీసీ నాయకుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. మొదటి నుండి పార్టీకి విధేయుడిగా జగన్ కి అండగా అసెంబ్లీలో మీడియా సమావేశాలలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే విధంగా అనిల్ కుమార్ రాజకీయాలు చేస్తున్న తరుణంలో పార్టీలో ఇలాంటి యువకులను ప్రోత్సహించాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్.

 

రెండోసారి వైసీపీ పార్టీ నుండి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కావటంతో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటిపారుదల శాఖ మంత్రిని చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉండటంతో బీసీ వర్గాల లో ఆనందం నెలకొంది. పార్టీకి మరియు పార్టీ తీసుకునే నిర్ణయాలకు విధేయుడిగా ఉండటంతోనే అనిల్ కుమార్ యాదవ్ కి ఈ పదవి దక్కినట్లు వైసీపీ నేతలు భావిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ విషయం పార్టీ నాయకులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఏపీ రాజకీయాల లో వార్తలు జోరందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: