టీడీపీకి 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఆ పార్టీ అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఆ ఓటమి కంటే వారిని మరింత బాధించింది 23 సంఖ్య. ఆ ఎన్నికల్లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యే, ముగ్గురు ఎంపీ స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ ఓటమికి 23 సంఖ్యకు ఉన్న లింకును వైసీపీ నాయకులు ఎంత ఫన్నీగా చూపించారో తెలసిందే. అధికారంలో ఉండగా తమ 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీ చేర్చుకున్నందుకు వారికిప్పుడు అదే సంఖ్య మిగిలిందని ఎద్దేవా చేశారు.

IHG

 

దీంతో వారి ఓటమి కంటే 23 సంఖ్యే ఎక్కువ ఇబ్బంది పెట్టింది. పైగా ఎన్నికల ఫలితాలు కూడా 23వ తేదీనే వెలువడటం టీడీపీకి పుండు మీద కారం చల్లినట్టైంది. ఇప్పుడు మరోసారి 23 సంఖ్య ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో పార్క్ హయాత్ హోటల్ లో మాజీ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్.. కలుసుకున్న విషయం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జూన్ 13న జరిగినా వెలుగులోకి వచ్చింది 23వ తేదీన. దీంతో ఈ సంఖ్య మరోసారి చర్చనీయాంశమవుతోంది.

IHG

 

అక్కడ టీడీపీ నాయకులు లేకపోయినా.. భేటీకి టీడీపీకి సంబంధం ఉందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వీరితో మరో వ్యక్తి ఆన్ లైన్లో కలిసారని.. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తే అని వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇరు పార్టీల నాయకుల మధ్య వాదనలు జరుగుతున్నాయి. రాజకీయంగా మరోసారి 23 సంఖ్య టీడీపీని బాగా వేధిస్తోందని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇప్పటికీ 23 టీడీపీకి నిద్ర పట్టనివ్వటం లేదు.. ఇప్పుడు మరోసారి టీడీపీకి చుక్కలు చూపిస్తోందని నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: