ఇటీవల ఏపీ శాసనమండలిలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. మళ్ళీ మూడు రాజధానుల బిల్లు మండలికి రావడంతో టీడీపీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలకు ధీటుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు స్పందించడంతో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఎలాగో మండలిలో టీడీపీకి బలం ఎక్కువ ఉండటంతో మూడు రాజధానుల బిల్లుని ఛైర్మన్ పక్కనబెట్టేశారు. దీంతో వైసీపీ వాళ్ళు స్పీకర్‌పై ఫైర్ అవుతూ రగడ చేస్తున్నప్పుడు, లోకేష్ తన మొబైల్‌లో వీడియో, ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు.

 

అప్పుడు వైసీపీ మంత్రులు వెల్లంపల్లి, అనిల్ కుమార్ యాదవ్‌లు లోకేష్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలు ప్రతిఘటించారు. దీంతో మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య పెద్ద రగడ జరిగింది. అయితే అప్పుడు మండలి లైవ్ టెలికాస్ట్ లేదు. ఇక అప్పుడు ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు. కానీ బయటకొచ్చాక టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే తాజాగా కూడా దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి స్పందిస్తూ...కీలక వ్యాఖ్యలు చేశారు.

 

మండలిలో సమస్య ఉన్నప్పుడు లైవ్ టెలీకాస్ట్ నిలిపివేయడంలో ప్రభుత్వ ఉద్దేశాలు తేటతెల్లం అయ్యాయని, మండలిలో జిప్ లాగారని ఫిర్యాదు చేస్తే హాజరైన మంత్రులలో అనిల్ కుమార్ స్పందించడాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలని, మండలిలో ఒకేసారి 18 మంత్రులు హాజరవడం బిజినెస్ రూల్స్ కు విరుద్ధమని చెప్పారు. మండలిలో మంత్రుల దుర్భాషలు, దాడిపై 18న చైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని, మంత్రులు కౌంటర్ ఫిర్యాదులో వాస్తముంటే వీడియో ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

 

అయితే దీపక్ రెడ్డి అడిగిన ప్రశ్నలు లాజిక్‌గానే ఉన్నాయని, జిప్ తీశారని మాట్లాడితే అనిల్ కుమార్ ముందు స్పందించారని, పైగా లైవ్ టెలికాస్ట్ ఆపేయడం కరెక్ట్ కాదని, దమ్ముంటే ఇప్పటికైనా మండలి ఫుటేజీ బయటపెడితే నిజనిజాలు బయటపడతాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. కాకపోతే ఎవరు ఎన్ని అనుకున్న ఫుటేజీ బయటకు రావడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: