కృష్ణా జిల్లాలో కరుడుకట్టిన టీడీపీ నాయకుడు, చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే నేత ఎవరనే అంటే ఠక్కున మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు చెప్పేయొచ్చు. 1999, 2004,2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలిచిన దేవినేని...2014లో చంద్రబాబు కేబినెట్‌లో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో మాత్రం దేవినేని తొలిసారి ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయినా సరే...ఉమా వైసీపీ ప్రభుత్వం మీద దూకుడుగా వెళుతూ...విమర్శలు చేస్తున్నారు.

 

ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెడుతూ జగన్‌ ప్రభుత్వాన్ని ఏకీపారేస్తున్నారు. అయితే ఈ విధంగా వైసీపీ అంటే ఒంటికాలి మీద వెళుతూ...టీడీపీ అంటే ప్రాణమిచ్చే దేవినేని ఉమా వైసీపీలోకి వెళ్లబోతున్నారని కృష్ణా వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రులు, నేతలకు జగన్ చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ప్రతి లెక్కలో బొక్కలని బయటకు తీస్తూ టీడీపీ నేతలనీ జైలుకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ టార్గెట్ పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

 

ఈ క్రమంలోనే దేవినేని ఉమా...తన బంధువైన దేవినేని అవినాష్ ద్వారా వైసీపీలోకి వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం అవినాష్ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ తూర్పు ఇన్‌చార్జ్‌గా ఉన్న అవినాష్...తనకు బాబాయ్ వరుసయ్యే ఉమాని సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పైగా ఇదివరకులాగా కృష్ణా టీడీపీలో దేవినేని పెత్తనం చెల్లడం లేదు.

 

ఓ రకంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు టీడీపీని వీడటానికి కారణం కూడా ఉమానే. ప్రస్తుతం ఉమా మాటని కృష్ణా టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. భవిష్యత్‌లో కూడా చంద్రబాబు దగ్గర ఉమా మాట కూడా చెల్లుబాటు కాదని, కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌లు ఉమాకు చెక్ పెట్టేస్తున్నారని తెలుస్తోంది. అయితే టీడీపీలో పరిస్తితి సరిగా లేకపోవడం, గతంలో అక్రమాలు బయటకొచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఉమా...అవినాష్ ద్వారా వైసీపీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని కృష్ణా వైసీపీ శ్రేణులు కోడైకూస్తున్నాయి. అయితే టీడీపీ అంటే ప్రాణమిచ్చేసే ఉమా...వైసీపీలోకి వెళ్ళడం జన్మలో జరగదని, ఉమాని దెబ్బతీయడానికి వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: