దక్షిణాది రాష్ట్రాలను కరోనా వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుండి భారీగా కేసులు నమోదవుతుండగా ఈరోజు ఆసంఖ్య మరింతగా పెరిగింది. ఎప్పటిలాగే తమిళనాడులో ఈరోజు కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2865 కేసులు బయటపడగా మరో 33మంది  కరోనా తో మరణించారు. ఇప్పటివరకు తమిళనాడు లో మొత్తం 67468కేసులు నమోదు కాగా 866 కరోనా మరణాలు సంభవించాయి.
 
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో ఈరోజు అత్యధికంగా 891 కేసులు నమోదయ్యాయి. మరో 5గురు మరణించారు ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సంఖ్య 10444 కు చేరగా 225మంది మరణించారు అటు ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు 497 కేసులు రాగ  మొత్తం కేసుల సంఖ్య 10331కు చేరింది అలాగే  కర్ణాటక లో ఈరోజు 397కేసులు నమోదకాగా మొత్తం కేసుల సంఖ్య 10118కి చేరింది. 
 
ఇక కేరళ లో కూడా ఈరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 152 పాజిటివ్ కేసులు నమోదు కాగా  81మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈకొత్త కేసుల తో కలిపి కేరళలో మొత్తం 3603కేసులు నమోదుకాగా అందులో 1691కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1888మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: