జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు బీజేపీ పార్టీలో చాలా సఖ్యత గానే వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా కేంద్రంతో గొడవలు పెట్టుకోకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలివిగా రాబట్టు కుంటూనే మరోపక్క కేంద్రానికి అనేక సూచనలు ఇస్తు రాజకీయాలు చేస్తున్నారు. మహమ్మారి కరోనా లాంటి విపత్కర సమయంలో ఆరెంజ్, గ్రీన్, రెడ్ జోన్ లు అనే కాన్సెప్ట్ తో తెరపైకి తెచ్చి కేంద్రానికి కొన్ని సూచనలు ఇస్తూ తనవంతుగా జగన్ కృషి చేయడం జరిగింది . చాలా వరకు బిజెపి పార్టీ పెద్దలు వైయస్ జగన్ కి అనుకూలంగానే ఉన్నట్లు మొన్నటి వరకు రాజకీయాలు కనపడ్డాయి.

 

దీనిలో భాగంగానే రాజ్యసభ సీటు పరిమళ నత్వాని విషయంలో బీజేపీ సూచన మేరకు తన పార్టీ తరఫున జగన్ రాజ్యసభకు పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా జగన్ కుర్చీ ని బీజేపీ టార్గెట్ చేసినట్లు, సరికొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు అందుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల రామ్ మాధవ్ స్వరం మార్చినట్లు, మొదటిలో జగన్ ఏడాది పరిపాలనపై ప్రశంసలు కురిపించిన...రామ్ మాధవ్ ఇటీవల జగన్ పరిపాలన అంతా రివర్స్ పరిపాలన అని సెటైర్లు వేయటం జరిగిందట.

 

అంతేకాకుండా త్వరలో ఏపీ బీజేపీ నాయకులు కలసికట్టుగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ధర్నా చేయబోతున్నట్లు...తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషించాలని సరికొత్త ఆందోళనలు నిరసనలు చేయాలని బీజేపీ ప్లాన్ వేసినట్టు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి రెడీ అవుతున్నట్లు, వార్తలు అందుతున్నాయి. దీనిలో భాగంగానే రామ్ మాధవ్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఇటీవల విమర్శలు చేయటం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: