ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  ప్రతీకార రాజకీయాలకు పోకుండా ఎక్కడ దూకుడుగా వ్యవహరించకుండా ఎంతో బాధ్యతాయుతంగా తన  రాజకీయాలు  తాను చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న రాజకీయ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏ విషయంలో అయినా పార్టీ పరంగా కాకుండా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న 10 పరీక్షల విషయంలో కూడా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులను  ప్రమాదంలో పెట్టినట్లు అవుతుంది అని పలుమార్లు స్టేట్మెంట్లు ఇవ్వడం ఆ తర్వాత ఇతర ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ బీజేపీ పార్టీల స్పందించడం జరిగింది. 

 

 

 ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏకంగా 10 పరీక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇలా  ప్రజలకు సంబంధించినటువంటి నిజమైన సమస్యలు లేఖల రూపంలో తెర మీదికి తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నారు పవన్  కళ్యాణ్ , ఇక మొన్నటికి మొన్న డిగ్రీ పరీక్షల్లో గురించి కూడా ఇలాంటి ఒక వాదనను తెరమీదకు తీసుకువచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ పరీక్షలను కూడా రద్దు చేయాలంటూ.. పవన్ కళ్యాణ్ వాదన వినిపించారు. 

 


 ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కూడా డిగ్రీ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందరు విద్యార్థులను  ప్రమోట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అయితే మొదట ప్రభుత్వం చేయాలని అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ వాదన వినిపించిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ పీజీ పరీక్షలు రద్దు చేసారూ . దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా  పవన్ కళ్యాణ్ ఎంతో బాధ్యతాయుతంగా ప్రజల సమస్యలను తెర మీదికి తెచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: