నేపాల్లోని ఎంతోమంది యువకులు భారత్ లోకి వచ్చి గూర్ఖాలు గా ఉద్యోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా నేపాల్ కి భారత్ కి మధ్య మంచి సంబంధం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో చైనా నేపాల్ దేశాన్ని తమవైపు ఆకర్షించాలని.. భారత్ లో పనిచేస్తున్న గుర్కాలను  కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ యువతకి  భారతదేశం పై ఉన్న ప్రేమ మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేపాల్ లో ఎన్నో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 

 

 అయితే భారత సైనికుల చేతుల్లో మొహం పగల కొట్టించుకున్నటువంటి చైనా సైనికులకు నేపాల్లో కూడా ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. నేపాల్లోని కోడరి అనేటువంటి గ్రామం దగ్గర.. చైనా నేపాల్ లో చేస్తున్నటువంటి రహదారుల నిర్మాణం మౌలిక వసతుల కల్పన చేస్తూ కొన్ని ఎకరాల భూమిని కబ్జా చేస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ దేశానికి చెందిన భూభాగంలో మీరెవరు చేయడానికి అంటూ సమీపంలోని ప్రజలందరూ ఎదురుతిరిగారు. చైనా సైన్యాన్ని తరిమితరిమి కొట్టారు. ఆయుధాలు చూపించి చైనా సైన్యం బయట పెట్టాలని భావిస్తే ఆయుధాలను లాక్కొని మరి చైనా సైనికులను తరిమి తరిమి కొట్టారు. 

 


 మొన్నటికి మొన్న భారత సైనికుల చేతిలో మొహాలు పగలగొట్టించుకున్న చైనా సైనికులు... ప్రస్తుతం నేపాల్ ప్రజల చేతిలో కూడా తన్నులు తిన్నారు. ఇలా వరుసగా చైనా వ్యూహాలు కాస్త విఫలమవుతూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో క్రమక్రమంగా చైనా అయోమయంలో పడిపోతుంది. అయితే నేపాల్కు చెందిన ప్రభుత్వం చైనా కు మద్దతు ప్రకటించిన ప్రజానీకం మొత్తం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తోంది. అయితే నేపాలి లో మాత్రం తిరుగుబాటు మొదలైంది అని అంటున్నారు విశ్లేషకులు మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: