చైనా కి ఇక బుద్ధి రాదా... ఇప్పటికే  పాములు గబ్బిలాలు అంటూ చెత్త మొత్తం తిని కరోనా  వైరస్ రావడానికి కారణమయ్యారు. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంటే.. చైనీయుల్లో  మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. తాజాగా అక్కడ కుక్క మాంసం వేడుకలు ప్రారంభించారు. కరోనా  వైరస్ కారణంగా ఎన్నో రోజుల నుంచి కుక్క మాంసానికి  దూరమైన వాళ్ళందరూ కుక్క మాంసాన్ని ఆరగించడానికి సిద్ధమయ్యారు.

 

IHG

 

 ఒక మనిషి మాంసం తప్ప.. చైనీయులకు అన్ని ఆహారాలు లాగించేస్తారన్నది తెలిసిందే. ఇక కుక్క మాంసం అంటే వారికి మహా ఇష్టమట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా వ్యాప్తంగా గ్రాండ్ గా  కుక్క మాంసం వేడుకలు జరుగుతున్నాయి.  అయితే ఇప్పటికే ఇష్టం వచ్చిన ఆహారం తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తికి కారకులైనా.. చైనీయులకు మాత్రం అస్సలు బుద్ధి రాలేదు. మళ్లీ అలాంటి తప్పే  చేస్తున్నారు.

 

IHG

 

 అయితే ఇలా కుక్క మాంసం వేడుకలు జరపడం వాళ్ళకి కొత్తేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ వార్షిక వేడుకలు నిర్వహిస్తున్నారు  చైనీయులు. జంతు ప్రేమికులు ఉద్యమాలు చేపట్టి కుక్క మాంసాన్ని తినడం ఆపేయాలని డిమాండ్ చేసినప్పటికీ... అవి వీరికి పట్టింపె ఉండదు. పది రోజులపాటు ఈ కుక్క మాంసం వేడుకలు జరగనుండగా..ఎన్నో కుక్క మాంసం వెరైటీలు వేడుకలు అందుబాటులో ఉండనున్నాయి. మరి ఇలాంటి చెత్త అలవాట్లు ప్రపంచాన్ని మరెంత  ప్రమాదంలో నెట్టుతాయో...            

మరింత సమాచారం తెలుసుకోండి: