ప్రముఖ కామెడీ క్యారెక్టర్ బిత్తిరి సత్తి టీవీ9 నుంచి బయటకు వచ్చేశారు. ఆయన కొంత కాలం క్రితమే వీ6 ఛానల్ నుంచి టీవీ9 కు వచ్చారు. వీ6 లో ఆయన చేసే తీన్మార్ వార్తలు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. మరి ఇంతలోనే ఏమైంది.. బిత్తిరి సత్తి ఎందుకు బయటకు వచ్చేశారు.. ఈ ప్రశ్నలకు చాలా సమాధానాలు వినిపిస్తున్నాయి.

 

 

అయితే ఫాదర్స్ డే ప్రోగ్రామ్‌లో బిత్తిరి సత్తి తన తండ్రి ఫోటో వాడాడన్నది.. అది కూడా మేనేజ్ మెంట్ పర్మిషన్ లేకుండా.. తెలియకుండా వాడాడు అన్నది ఓ కారణంగా చెబుతున్నారు. కానీ.. ఆ ఒక్క కారణానికే టీవీ9 నుంచి తీసేస్తారా అన్న సందేహాలు మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అసలు కారణం వేరే ఉందంటూ ఆ ఛానల్లోని ఉద్యోగులు గుబులు పడుతున్నారు.

 

 

ఎందుకంటే.. కరోనా దెబ్బతో ఛానళ్లన్నీ ఇబ్బందుల్లో పడిపోయాయి. ఆర్థిక వనరుల విషయంలో అప్రమత్తం అవుతున్నాయి. యాడ్స్ తగ్గిపోయాయి.. ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో బిత్తిరి సత్తి వంటి కాస్ట్‌లీ నటుడిని భరించడం కష్టమనే టీవీ9 ఫాదర్స్ డే ఇష్యూను సాకుగా చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది.

 

 

అదే నిజమైతే.. టీవీ9లో మరికొందరు ఎక్కువ జీతాలు తీసుకునే వారికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అత్యధిక జీతాలు తీసుకునే వారిని టీవీ9 యాజమాన్యం కొన్నాళ్ల నుంచి ఉద్యోగాల్లోంచి తీసేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు అది మరింత జోరందుకోనుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే టీవీ9 ఉద్యోగుల్లో.. ప్రత్యేకించి ఎక్కువ జీతాలు అందుకునే వారికి ముప్పు పొంచి ఉందన్నటాక్ వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: