ఒకవైపు తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఇక నగరంలో అయితే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కడా తగ్గడం లేదు.. దీని సంఖ్య దినదినం వృద్ధి చెందుతుంది.. ఈ నేపధ్యంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించకుండా, అసలు కరోనా అంటే ఏదో చిన్నపాటి వ్యాధిలా ప్రవర్తిస్తూ దీని విజృంభనకు కారణం అవుతున్నారు.. ఇక ఇదివరకు కరోనా కేసులు ఎక్కడ నమోదైనా వారందరిని ముందుగా గాంధీ హస్పిటల్‌కు తరలించే వారు.. ఇప్పుడంటే ఇతర చోట్లల్లో వీరి కోసం ఏర్పాటు చేసారు..

 

 

అయితే గాంధీ ఆస్పత్రిలో విపరీతంగా పెరిగిపోయినా కరోనా కేసుల వల్ల అక్కడ సిబ్బంది చాలా ఇబ్బందికి గురవుతున్నామనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. అదీగాక గాంధీ డాక్టర్లపై కొన్ని సార్లు దాడులు కూడా జరిగాయి.. ఈ నేపధ్యంలో ఇది వరకు సమ్మె చేసిన వారు ఆరోగ్యశాఖ మంత్రి హమీతో విధుల్లో చేరారు.. అయితే ఇప్పటి వరకు మంత్రి ఈటల తమ డిమాండ్ల పరిష్కారానికి ఇచ్చిన హామీ నెరవేరక పోతుండడంతో జూనియర్‌ వైద్యులు మరో సారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. కాగా పది రోజులవుతున్నా సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి చలనం లేకపోవడంతో జూడాలు ఈ సారి సమ్మె ఉధృతంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

 

ఈ దిశగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ఔట్‌సోర్సింగ్‌ విభాగాల సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ వీరంతా కలసి కట్టుగా సమ్మెకు సంసిద్దమైతే పరిస్దితి దారుణంగా ఉంటుంది.. ఇప్పటికే ప్రైవేట్ అస్పత్రిలు కరోనా విషయంలో తగిన రీతిలో స్పందించడం లేదు.. అదీగాక ఇప్పుడున్న నేపధ్యంలో సమ్మె అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే.. అయితే డాక్టర్ల డిమాండ్‌లు అమలు చేయడమా లేదా అనే విషయంలో త్వరగా అధికారులు ఓ నిర్ణయానికి రావడం చాలా ముఖ్యం.. లేదంటే గాంధీ ఆస్పత్రి వైద్యులు తీసుకునే నిర్ణయం వల్ల జరిగే నష్టంతో ప్రజలు ముఖ్యంగా కరోనా రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: