రాష్ట్రంలో ప్రజలను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.. ఇప్పటికే సరైన ఉపాధి లేక ఎందరో నిరుద్యోగులుగా మారుతున్నారు, మారారు కూడా.. ఇక మధ్య, పేద తరగతి వారైతే తమ బాధలు ఇతరులకు చెప్పలేక, ఎదురయ్యే కష్టాలను భరించుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు.. ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే పరిహారం లభిస్తుంది.. కానీ ఈ కరోనా సృష్టించిన విపత్తు వల్ల ఎవరిని ఎవరు ఆదుకునే పరిస్దితులు లేవు.. ఇలాంటి కష్టకాలంలో ఏపీఎస్‌ఆర్టీసీలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్ ఇచ్చారు.

 

 

కాంట్రాక్ట్‌ ముగిసిందని...నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయట. అసలే ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు.. ఏదో వచ్చిందే చాలు అని చేసుకుంటున్న పనిని కూడా ఇలా అర్దాంతరంగా దూరం చేస్తే బ్రతికేది ఎలా అని సిబ్బంది ఆందోళపడుతున్నారట.. ఇదిలా ఉండగా గతంలో మంత్రి పేర్ని నాని ఉద్యోగులను తొలగించబోమని హామీ ఇచ్చారట.. అయితే ప్రస్తుతం అధికారులు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని మాత్రం విధులకు మాత్రం హజరు కావద్దని చెబుతున్నారట.. ఈ దశలో మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వాపోయారు.

 

 

ఈ నిర్ణయంతో దాదాపు 7800 మంది ఔటర్‌సోర్సింగ్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది.. మరి ఈ విషయం ఏపీ సీయం జగన్ దృష్టికి వెళ్లితే ఎలా స్పందిస్తారో అని అనుకుంటున్నారట.. ఇకపోతే ఒకవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, విజృంభిస్తున్న కరోనా వైరస్, నిరుద్యోగం ఇలా సామాన్యులపై అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి.. ఇలాంటి నేపధ్యంలో ఉన్న ఏ కొద్దిపాటి ఆసరా కూడా సామాన్యులకు సంజీవినిలా అనిపిస్తుంది.. ఇక అదే కోల్పోతే బ్రతుకు భారం అవుతుంది.. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించి సామాన్య ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారో అని ఎదురు చూస్తున్నారట కొందరు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: