తెలంగాణలో ఈ గత కొంత కాలంగా పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వీకే సింగ్ తన పోస్ట్ కి రాజీనామా చేశారు.  ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే వీకే సింగ్ తనకు డీజీపీగా ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ సంచాలకులు వీకే సింగ్, తన పోస్ట్ కు రాజీనామా చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పదవీ విరమణ చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆయన తన రిజైన్ లెటర్ ను పంపించారు. 

 

తాను 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారినని తన లేఖలో ప్రస్తావించిన వీకే సింగ్, పోలీసు శాఖలో సంస్కరణలు తేవాలని భావించానని, కానీ ఆశయ సాధనలో విఫలమయ్యాయనని ఆయన వాపోయారు.  దశాబ్దాల తన సర్వీసులో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, స్పష్టమైన మనస్సాక్షితో విధులు నిర్వహించానని ఆయన తెలిపారు. కష్టపడటం, నిజాయితీతో ఉండటంతో విజయాలను సాధించవచ్చని గ్రహించానని, ఎవరైనా పోలీసు ఉద్యోగంలో చేరాలని భావిస్తే, పోలీసు శాఖలోనే చేరాలని సూచించారు. 

 

తెలంగాణ డీజీలు తేజ్ దీప్ కౌర్ మీనన్, టీ కృష్ణ ప్రసాద్ లు రిటైర్  కాగా, కేడర్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. తనకు డీజీపీగా  ప్రమోషన్ ఇవ్వాలని సీఎస్ కు ఆయన లేఖ రాసినా, స్పందన రాలేదు. ప్రమోషన్ ఇవ్వకుంటే రిజైన్ చేస్తానని చెప్పిన ఆయన, తాజాగా, రాజీనామా లేఖను పంపించడం గమనార్హం. వాస్తవానికి వీకే సీంగ్ ఈ సంవత్సరం నవంబర్ లో రిటైర్ కావాల్సి వుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: