ప్రస్తుతం పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలుగా జీవనం కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక పూర్వం పాకిస్తాన్ లో అనేక హిందూ ఆలయాలు ఉన్నాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయిన అనంతరం హిందూ ఆలయాలపై దాడులు నిర్వహించారు. దాంతో హిందూ ఆలయాన్నిటిని కూడా ధ్వంసం చేశారు పాకిస్థానులు. పాకిస్తాన్ లో అక్కడక్కడ మాత్రమే హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇక మరి కొన్ని ప్రాంతాలలో అయితే ఆలయాలు శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. 

 

IHG

 

ఇక ఇలా ఉండగా మరోవైపు పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ లో... శ్రీ కృష్ణ దేవాలయం నిర్మాణం చేపడుతుంది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన స్థలాన్ని ఆలయ నిర్మాణం  కోసం కావాల్సిన నిధులు అన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. పాకిస్తాన్ లో ఈ ఆలయాన్ని 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నారు. ఇక నిజానికి ఇస్లామాబాద్ లో హిందూ జనాభా అధిక సంఖ్యలో జీవనం కొనసాగిస్తున్నారు.

 

IHG

 


ఈ తరుణంలోనే అక్కడివారు ఆలయాలకు వెళ్లేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు కారణం గానే ఇస్లామాబాద్ లోనే ఒక ఆలయం నిర్మించి పోతున్నట్లు మానవహక్కుల పార్లమెంట్ కార్యదర్శి లాల్ చంద్ తెలియజేశారు. అలాగే ఆయన 2017 లో హిందూ పంచాయితీకి సిడిఏ స్థలాన్ని కేటాయించిందని తెలియజేశారు. ఇక ఈ ఆలయ నిర్మాణానికి పాక్ ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తూ 10 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన తెలియజేశారు. దీనితో ఇటీవల ఈ ఆలయానికి సంబంధించిన భూమి పూజ కూడా పూర్తయ్యింది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: