గత కొన్ని రోజుల నుంచి భారత్ - చైనాల మద్య యుద్ద వాతావరణం నడుస్తుంది.  డ్రాగన్ల దారుణ మారణ కాండలో మన సైనికులు 20మంది అమరులయ్యారు. దాంతో భారత్ పౌరులు చైనాపై అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. చైనా వస్తువులను, యాప్స్ బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్ - చైనాల మద్య చర్చలు జరిగాయి.. దాంతో భారత్  భూబాగం వదిలి వెళ్లేందుకు డ్రాగన్లు ఒప్పుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ చైనా తన కుతంత్రాలు మళ్లీ కొనసాగిస్తూ వస్తుంది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో చైనా కదలికలను పరిశీలిస్తున్న సైనిక విభాగం విశ్లేషకులు చైనా మరో కయ్యానికి సిద్ధమైందని, ముఖ్యంగా దౌలత్ బేగ్ ఓల్డీ, డేవ్ సాంగ్ సెక్టార్లలో గొడవలు రేపాలని చూస్తోందని హెచ్చరిస్తున్నారు. 

 

చైనాకు సంబందించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాలను చేర్చి, సైనిక బలగాలను కూడా మోహరించిందని తెలుస్తుండగా, నిఘా వర్గాలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. మరో వైపు రెండు వారాల క్రితం మొదలైన యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2016లో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం పక్కనే తాజా క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం.

 

ఇక చైనా కదలికలను పరిశీలించిన భారత్, గత నెలాఖరులోనే డెప్ సాంగ్ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించింది. తాజాగా, సరిహద్దుల్లో చెక్ పాయింట్ల సంఖ్యను పెంచిన చైనా, మిలటరీ కార్యకలాపాలను పెంచింది. లేహ్ రోడ్లపై ఇండియా సైనిక వాహనాల సంఖ్య భారీగా ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: