ప్రస్తుతం భారతదేశంలో కరోనా ఉద్ధృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో అనేకమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. వీరి పరిస్థితి ఇలా ఉంటే దేశంలో రోజురోజుకీ నేరాలు-ఘోరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఆడవారి పై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే... మహారాష్ట్రలోని పూణే కస్టమర్ అధికారులు పెద్ద మొత్తంలో తరలిస్తున్న మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. వాటి ధర మొత్తంగా 1.75 కోట్లు గా ఉంటుందని వారు తెలిపారు. 

 


పూణేలో పక్కా సమాచారంతో అధికారులు రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న మొత్తం 865 కేజీల గంజాయిని, అలాగే 7.5 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఇందులో ఉన్న గాంజా ధర మార్కెట్లో రూ 1.04 కోట్లుగా, అలాగే మత్తు పదార్థాలు 75 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ కేసులో మొత్తం నలుగురు వ్యక్తులను వారి ప్రయాణించిన రెండు వాహనాలను అధికారులు సీజ్ చేశారు.

IHG

 


మహారాష్ట్ర రాష్ట్రంలో ఒక వైపు కరోనా కేసుల విశ్వరూపం దాలుస్తుంటే, మరోవైపు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: