తమ స్వార్థం కోసం ఈ మద్య కొంత మంది మనుషులు కృరమృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మూగజీవాల వధ మనసులను కదిలించి వేస్తున్నాయి. ఎప్పటి నుంచో వన్య మృగాలపై మానిషి దాష్టికత్వం కొనసాగుతూనే ఉంది.  కాకపోతే ఈ మద్య కేరళాలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ గర్భంతో ఉన్న ఏనుగు మనిషి చేసిన తప్పిదం వల్ల బాంబు తినడంతో నోటికి తీవ్ర గాయం అయ్యింది. దాంతో దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆ ఏనుగు ఏమీ తినకుండా బాధపడుతూ నీటిలో కన్నుమూసింది.  ఆ దారుణంపై భారత దేశం మొత్తం కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత ఓ కుక్క మూతికి ప్లాస్టర్ చుట్టారు కొంతమంది దుండగులు. అది ఆకలితో అలమటిస్తుంట.. మొత్తానికి దాన్ని డాక్స్ టేకర్స్ కాపాడారు.

 

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ మద్య కాలంలో నోరు లేని జీవాలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఏనుగుల దందాల కోసం వాటి నోటిలో బాంబులు పెట్టి హతమార్చుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వేటగాళ్ల బారిన పడి చాలా వరకు కన్నుమూశాయి. ఇటీవల కేరళలో పేలుడు పదార్థాలు తిని ఏనుగు చనిపోయిన ఘటన మరిచిపోక ముందే చిత్తూరు జిల్లాలో మరో ఏనుగు మృత్యువాత పడింది. బండ రాళ్ల మధ్యలో చనిపోయి కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో అటవీ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. 

 

కాగా, గంగవరం మండలం కేసిపెంట అటవీ ప్రాంతంలోకి పశువుల కాపరులకు కుళ్లిపోయిన వాసన వచ్చింది. వెళ్లి చూడగా రెండు రోజుల క్రితం చనిపోయిన ఏనుగు కనిపించింది. ఈ విషయం వెంటనే అటవీశాఖ వారికి అందించారు. ఆ ఏనుగు కి పోస్ట్ మార్టం నిర్వహించిన అధికారులు.. ఇటీవల బండరాళ్ల మధ్య పడిపోయి ఉండటంతో కాలు జారిపడిపోయి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.  రెండు మూడు రోజుల క్రితమే అది చనిపోయి ఉంటుందని చెబుతున్నారు. కాగా చాలా రోజులుగా  ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: