ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను బులిటెన్ ద్వారా మీడియాకు తెలియజేయడం జరిగింది. నేడు కొత్తగా రాష్ట్రం మొత్తంగా 20 కొత్త కేసులు నమోదవగా, 24 మంది కరోనా బారినుండి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

 


కొత్త కేసులతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2642 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1745 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 845 కరోనా కేసులు యాక్టివ్గా కొనసాగుతున్నాయి. ఇందులో ఏడు మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికవరీ అయిన వారి శాతం 66.01 గా ఉంది. టెస్టింగ్ కి పంపించిన శాంపిల్స్ లో 4.84 శాతం పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను 2059149 మంది డౌన్లోడ్ చేసుకున్నారని నివేదిక తెలుపుతోంది.

 


మరోవైపు భారత దేశం మొత్తంగా చూస్తే రోజు రోజుకి కాని మన దేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. గడచిన 24 గంటల్లో భారతదేశంలో ఏకంగా పదహారు వేల కొత్త కరోనా కేసులు నమోదవగా 400 పైగా మరణాలు సంభవించాయి. గడిచిన రెండు వారాల నుండి భారత్ లో అమాంతంగా కరోనా వ్యాధి చెందుతోంది. ముఖ్యంగా అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుండి ఈ కేసుల ప్రభావం కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: