దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మార్చిలో లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో అందరూ ఇంటి పట్టున ఉంటూ జాగ్రత్తలు పాటించారు. కానీ ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు.. ప్రయాణాలు చేస్తున్నారు. దాంతో కేసులు పదుల సంఖ్యలు దాటి వందల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే మొన్న 600 కేసులు దాటాయంటే అర్తం చేసుకోవొచ్చు.  తాజాగా సింగరేణి కార్మికులకు కరోనా భయం పట్టుకుంది. ఫిబ్రవరిలో కరోనా కేసులు మన దేశంలో మొదలయ్యాయి.. ఆ సమయంలో ఎక్కువగా కరీంనగర్ లో కేసులు నమోదు కావడం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

 

ఆ సమయంలో కరోనా రెడ్ జోన్ గా ప్రకటించారు.. ముఖ్యమైన ప్రదేశాలను కంటైన్ మెంట్స్ గా విభజించారు.  తాజాగా మంచిర్యాల జిల్లాలో కేసులు పెరగటం బెల్లంపల్లిలో ఓ కార్మికుడికి కరోనా రావటంతో ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి భద్రత కల్పించటం లేదంటున్నారు. ప్రతీ కార్మికుడికి మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీ చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా సింగరేణి కోటపై కరోనా రక్కసి దండయాత్ర మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో ఎన్ని కేసులు నమోదు అయినా మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదు కాలేదు.

 

ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించి.. ముంబాయి నుంచి వలస కూలీలు తమ స్వస్థలం రావడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇక్కడ కూడా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటికే 50 కరోనా కేసులు నమోదవటం వర్షాకాలం సీజన్ వస్తుండటంతో వ్యాధి విస్తరిస్తుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మందమర్రి,శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి డివిజన్లు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో మందమర్రి,శ్రీరాంపూర్, బెల్లంపల్లిలో సింగరేణి డివిజన్లు ఉన్నాయి. ఈ మూడు డివిజన్లలో సుమారు23 వేలకు పైగా కార్మికులు గనులలో పని చేస్తున్నారు. సామూహికంగా పనులకు హజరయ్యే సందర్భంలో కరోనా సోకే ప్రమాదం ప్రమాదం ఉందని భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: