క‌రోనా వైర‌స్.. కంటికి క‌నిపించ‌కుండానే ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. గ‌త ఏడాది డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మనుగడను సవాల్ చేస్తోంది. వ్యాక్సిన్ లేని ఈ క‌రోనా యావత్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతున్నది. ప్రతి రోజు లక్షన్నరకుపైగా వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో క‌రోనా కేసుల భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు మ‌ర‌ణాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి.

 

అయితే కరోనావైరస్ మహమ్మారి మనం ఇప్పటివరకు ఉన్న జీవనశైలిని మార్గాలను పూర్తిగా మార్చేసింది. ఫేస్ మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం, పరిశుభ్రత మొదలైన వాటిని అలవాటు చేసుకుంటున్నాం. వీటిని అల‌వాటు చేసుకుంటున్నాం స‌రే.. కానీ ఇదే స‌మ‌యంలో కొన్ని త‌ప్పులు చేస్తున్నాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి, కానీ సరిగ్గా ధరించడం కూడా అంతే ముఖ్యం. సాధార‌ణంగా చాలా ముక్కును క‌వ‌ర్ చేయ‌డం లేదు. ముక్కు అనేది శరీరంలోకి వైరస్ ప్రారంభ ప్రవేశ స్థానం, మరియు ముక్కులోని కణాలు కరోనావైరస్ తనను తాను సులభంగా అటాచ్ చేసుకోగలవు. 

 

దీంతో క‌రోనా బారిన ప‌డే రిస్క్ ఎక్కువ. సో..ఫేస్ మాస్క్ ను సరిగ్గా ధరించాలి. అలాగే  హ్యాండ్‌వాష్‌కు వాట‌ర్‌ లేనప్పుడు హ్యాండ్ శానిటైజర్ వాడొచ్చు. మీరు ఇంట్లో లేదా ఆఫీస్‌లో మరియు మీరు యాక్సెస్ చేయగల వాష్‌రూమ్ ఉంటే.. మీరు హ్యాండ్ శానిటైజర్ బ‌దులు సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే త‌ర‌చూ శానిటైజర్ వాడ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు ఇత‌రిత‌ర స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఇక ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులను చేతులు లేదా చర్మంపై అస్స‌లు యూజ్ చేయ‌కూడ‌దు. అదే విధంగా.. మీరు ప్యాక్ చేసిన ఆహారాన్ని తెరిచే ముందు వాటిపై క్రిమిసంహారక స్ప్రే చేయవచ్చు, అయితే, తాజా పండ్లు మరియు కూరగాయలను అటువంటి రసాయనాలతో స్ప్రే చేయకూడదు. దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో.. బీకేర్‌ఫుల్‌..!!

 
 
 


 
 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: