మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై మీడియా సమావేశం పెట్టి చేసిన కామెంట్లు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి . వైయస్ శిష్యుడి గా పేరొందిన ఉండవల్లి స్వయంగా ఈ విమర్శలు చేయటం తో విపక్షాలు వీటిని ఆధారం చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టిన విషయం అందరికీ తెలిసిందే. న్యాయస్థానాలతో మరియు ప్రభుత్వ అధికారులతో జగన్ సర్కార్ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తూ ఉండటాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వ వ్యవస్థలో గ్రిప్ పెంచుకోవాలి తప్ప…. గొడవలు పెట్టుకోకూడాద్దు అని సూచించడం జరిగింది. 

 

చాలా సందర్భాలలో నెల్సన్ మండేలా తనకు ఆదర్శమని చెప్పే వైయస్ జగన్ ఆయనలా వ్యవహరించాలని సూచించారు. 27 ఏళ్ల జైలు జీవితం గడిపిన నెల్సన్ మండేలా అధ్యక్షుడు అయ్యాక తనను ఇబ్బంది పెట్టిన వారికి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించారని సూచించారు. అంతేగాని రివేంజ్ డ్రామాలు.... ప్రజెంట్ చేయకూడదని జగన్ పనితీరుకు సూచనలు ఇచ్చాడు. ఎంతసేపు జగన్ దృష్టి పెట్టాల్సింది ప్రజల పైన మరియు ఇచ్చిన నవరత్నాలు, హామీలు వాటిపైనే పెట్టాలి గాని కక్ష సాధింపు చర్యలకు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటే నెగిటివ్ ఇంప్రెషన్ ప్రభుత్వంపై పడుతుందని సూచించారు.

 

ఏదిఏమైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడితే ప్రభుత్వానికి డామేజ్ జరుగుతుందని ఉండవల్లి మంచే చెప్పాడు కానీ అది వేరే లా ప్రతిపక్షాలు ప్రాజెక్ట్ చేస్తున్నాయని తాజా పరిణామాలపై పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే అప్పట్లో చంద్రబాబు వేయాలనుకున్న ఫ్యాక్షనిస్టు ముద్ర ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోతుందని ముందు జాగ్రత్తగా జగన్ ప్రభుత్వాన్ని ఉండవల్లి ఒక విధంగా అలర్ట్ చేశారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: