సమాజంలో లేడీలు రోజు రోజుకి కిలాడీలు అయిపోతున్నారు. టెక్నాలజీ వచ్చాక మరీ అందచందాలతో పెళ్లి కాకముందే ఒకరిద్దరిని మెయింటైన్ చేస్తూ, అవసరాలు తీర్చుకుంటున్నారు. ఒకపక్క పెళ్లి అయిన కూడా భార్య మరో పక్క టెక్నాలజీతో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని కుటుంబాలను మరీ బజార్లోకి లాక్కుంటున్నారు. భర్త మరియు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ కిలాడీ లేడీ పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర 16 లక్షలకు పైగా దోచేసింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులో అంకుర్ శర్మ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మేట్రిమోనియల్ సైట్ ద్వారా  కిరారా శర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. పరిచయం బాగా క్లోజ్ అవటంతో ఓ రోజు కిరారా శర్మ మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని తెలిపింది. ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అంకుర్ శర్మ అమ్మాయి పై బలమైన నమ్మకం ఏర్పడింది.

 

దీంతో రోజురోజుకీ పరిచయం బాగా క్లోజ్ అవటంతో అంకుర్ శర్మ నుంచి ఏకంగా రూ. 16.82 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా అతనితో పరిచయం తగ్గిస్తూ ద్వారం పెట్టింది. ఆ తరువాత కిలాడీ లేడీ ముందు వివాహానికి ఒప్పుకున్న, తర్వాత ఒప్పుకోకుండా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా కామ్ గా సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి తనకి ఆ యువకుడికి ఉన్న పరిచయ స్థలాల నుండి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. దీంతో ఆ సాఫ్ట్వేర్ యువకుడు అంకుర్ శర్మ మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇదే టైములో బెంగళూరు నగరంలో ఓ వ్యక్తి మహిళా దగ్గర ఏడు లక్షల మేర మోసం చేశాడు. బనశంకరికి చెందిన మహిళ ఓ కంపెనీలో పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె రెండో వివాహం కోసం ఓ మేట్రిమోనియల్ సైట్ లో తన ప్రొఫైల్ ను  అప్లోడ్ చేసింది.

 

ఈ క్రమంలో గతేడాది రమేశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా ముదిరి ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవటం జరిగింది. దీంతో వెంటనే ఆ కిలాడీ కేటుగాడు తన ప్లాన్ అమలు చేశాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య చెబుతూ ఆ మహిళ దగ్గర ఏడు లక్షల తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రం లో పని ఉందని చెప్పి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి సదరు మహిళ కి పంగనామాలు పెట్టాడు. దీంతో బాధితురాలు మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విధంగా మ్యాట్రిమోనీ ద్వారా చాలా మంది యువతీ యువకులు మోసపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: