ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ నర్సాపురం ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు. ఆయన ఏపీలో జగన్ సర్కార్ కి ఎదురునిలిచి అసలైన ప్రతిపక్ష నాయకుడిగా మారిపోయారు. గెలిచిన తరువాత నుంచి నా రూటే సెపరేట్  అంటూ వస్తున్న రాజుగారు ఇపుడు ఏకంగా వైసీపీ నాయకత్వాన్ని సవాల్ చేశారు.

 

దానికి పరిహారంగా ఆయనకు షోకాజ్ నోటీస్ అందింది. అయితే దానికి రాజుగారు ఇచ్చిన సమాధానం ఇపుడు మరింత హాట్ హాట్ గా ఉంది. ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉండడమేంటి అంటూ రాజుగారు ఏకంగా విజయసాయిరెడ్డి మీద సెటైర్లు పేల్చారు.

 

ఎన్నికల సంఘం ముందు వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీగా రిజిష్టర్ అయిందని, దానికి జాతీయ పదవులు ఎలా వస్తాయంటూ రాజు గారు  లాజిక్ గా పాయింట్ లాగారు. సరే ఇది వైసీపీకి సంబంధించి ఆయన అడిగినా మరో వైపు టీడీపీ కూడా పక్కా ప్రాంతీయ పార్టీ. అది కూడా అలాగే ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయి ఉంది. 

 

దానికి జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఉంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు ఉంటున్నారు. ఇపుడు రాజు గారు ఎత్తిన లాజిక్ పాయింట్ తో టీడీపీకి కూడా గట్టి షాక్ తగిలినట్లు అవుతోంది. టీడీపీ ఎలా జాతీయ పాటీగా క్లెయిమ్  చేసుకుంటుంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజానికి జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్టాల్లో పార్టీ పోటీ చేయలి. ఒక్కో చోట ఆరు శాతం ఓట్లను తెచ్చుకోవాలి. లేదా అక్కడి అసెంబ్లీలలో ప్రాతినిధ్యం ఉండాలి. 

 

నిజానికి దేశంలో ఆ విధంగా చూసుకుంటే చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకునే చలామణీ అవుతున్నాయి. కానీ ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. మరో వైపు కొన్ని జాతీయ పార్టీలు ఓడిపోయి బాగా తగ్గిపోయి ప్రాంతీయ పార్టీలు అయిపోయాయి. ఇపుడు రాజుగారు ఎత్తిన పాయింట్లతో మొత్తం జాతీయ పార్టీల పేరిట చలామణీ అయ్యే టీడీపీ లాంటి పార్టీల గుట్టు కూడా బయటపెట్టినట్లు అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: