ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ దైర్యానికి ప్ర‌తీక‌. క‌మ్యూనిస్టుల కంచుకోట‌ను కూల‌గొట్టి సీఎం అవ‌డ‌మే కాకుండా వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న ధీశాలి. దీదీ ప‌రిపాలిస్తున్న ప‌శ్చిమ బెంగాల్‌లో కరోనా కేసుల సంఖ్య‌ రోజురోజుకూ పెరిగిపోతోం‌ది. ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య గురువారం కొత్త‌గా 15 మంది మృతి చెంద‌డంతో 600 మార్కు దాటి 606కు చేరింది. దీంతో ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌రం పెరిగిపోతోంది. ఇదే స‌మ‌యంలో నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కూడా పెరుగుతోంది.

 

బెంగాల్‌లో గురువారం కొత్త‌గా 470కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 16 వేలకు చేరువ‌య్యింది. మొత్తం 15,648 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల‌లో 4,852 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండగా.. మ‌రో 10,190 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండ‌గా, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ జూన్‌ 30తో ముగియనుంది. అయితే, పలు సడలింపులతో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ ప్రభుత్వం పొడగించింది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసి ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాలున్నాయని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి ఛటర్జి ఒక ప్రకటనలో తెలిపారు.

 


లాక్‌డౌన్ కొన‌సాగింపు ప్ర‌క‌ట‌న‌కు ముందు ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కొల్‌కతాలోని నబన్నాలో రాష్ట్రంలో కొవిడ్‌-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేపీ పశ్చిమ బెంగాల్ యూనిట్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి మనోజ్, భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి స్వపన్ బెనర్జీ, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ భట్టాచార్య పాల్గొన్నారు. నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ను సడలింపులతో జూలై చివరి వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: