అవును అండి బాబు.. ఎంత బద్ధకం అంటే? మూత్ర విసర్జన ఆపుకొనేంత బద్ధకం. చెప్పడానికి వరస్ట్ గా ఉన్న ఈ ఘటన చైనాలోనే జరిగింది. అసలు ఏం జరిగింది? ఏం అయ్యింది అని పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఓ వ్యక్తి వరుసగా 10 నుండి 12 బీర్లు తాగాడు. అలా తాగే సమయంలో మూత్ర విసర్జన చెయ్యడం మర్చిపోయాడు. 

 

IHG

 

ఆ మతిమరుపు అతనికి పెద్ద శత్రువు అయ్యింది. అలా నిద్రపోయాడు.. లేచే సరికి అతడి  మూత్రాశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన చైనాలోని హు అనే వ్యక్తికి జరిగింది. 10 బీర్లకు పైగా తాగేసి మూత్ర విసర్జన చెయ్యాలి అనే ఆలోచన కూడా లేని స్థితిలోకి చేరిపోయాడు. ఏకంగా 18 గంటల పాటు నిద్రపోయాడు. 

 

IHG

 

ఇంకేముంది.. నిద్ర లేవగానే తట్టుకోలేనంత నొప్పి వచ్చింది.. దీంతో అతను వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు హూ మూత్రాశయం మూడు చోట్ల పగిలి ద్రవం అతని కడుపులోకి చేరి నొప్పి వచ్చిందని తెలిపారు. సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల అతని ప్రాణాలను కాపాడినట్టు వైద్యులు తెలిపారు. 

 

IHG

 

ఇకపోతే మత్తులో ఉన్నప్పుడు ఇది మాత్రం మర్చిపోవద్దు అని వైద్యులు అంత చెప్పగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం చైనీయులను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంత బద్ధకం ఏంటి అండి బాబు.. ఈ బద్ధకం వల్లే కరోనా పుట్టింది. ఆ కరోనా'నే ప్రపంచాన్ని ఇలా నాశనం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: