నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఉన్న కొద్దీ కుదిపేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదటి నుండి వ్యవహరిస్తూ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విపక్ష పార్టీలతో  చేతులు కలిపి పనిచేస్తున్నారు అన్న టాక్ నిమ్మగడ్డ పై ఎప్పటినుండో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దానికనుగుణంగా ఇటీవల సుజనాచౌదరి మరియు కామినేని శ్రీనివాస్ లతో  పార్క్ హయత్ హోటల్ లో భేటీ అయి అడ్డంగా వీడియోలలో దొరికి పోవడంతో ఇప్పుడు తాజాగా నిమ్మగడ్డ వ్యవహార శైలి పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి అసలు రాజకీయ నాయకుల తో పని ఏమిటి అన్న టాక్ బలంగా వినబడుతుంది.

 

మరోపక్క ఈ భేటీ ఉద్దేశించి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వంపై కుట్ర చేయటానికి నిమ్మగడ్డ రమేష్ వ్యూహాలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తనని ఇంకా రాష్ట్రప్రభుత్వం పదవిలోకి తీసుకోకుండా, కావాలని ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తూ గవర్నర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోపక్క హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది.

 

కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం పార్క్ హయత్ హోటల్ లో ఇతర రాజకీయ పార్టీ నేతలతో భేటీ అవుతూ నిమ్మగడ్డ వ్యవహరించటం ఆయనలో మరో నటుడు ఉన్నారని, సరికొత్త యాంగిల్ ఇదే అని ఆయన వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు ఎన్నికలు లేవు, హోదాలో ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లాలని నిమ్మగడ్డ యొక్క తహతహా అంటూ విమర్శలు చేస్తున్నారు. పార్క్ హయత్ హోటల్ వీడియో ఘటన బయటపడ్డ గా నిమ్మగడ్డ కావాలని ఆ వ్యవహారం డైవర్ట్ చేయటానికి హైకోర్టులో పిటిషన్ అదేవిధంగా గవర్నర్ కి ఫిర్యాదు చేయడం వంటివి చేస్తున్నారని, ఆయనలో మంచి నటుడు రచయిత ఉన్నారని, అధికార పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: